నుపుర్ శర్మ.. బీజేపీ అధికార ప్రతినిథిగా వుంటూ ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భారతదేశం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చిత్రమేంటంటే, ప్రపంచంలో చాలామంది రాజకీయ ప్రముఖులు చాలా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయా మతాలపై చేస్తున్నారు. దేశాధినేతలూ ఇందులో వున్నారు.
కానీ, చిత్రంగా భారతదేశం మీదనే ప్రపంచ దేశాల్లో కొన్ని విషం చిమ్మాయి. సరే, ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి.? అన్నది వేరే చర్చ. అసలు మనం ఏమనుకుంటున్నాం.? మన భారతదేశం ఏమనుకుంటోంది.? అన్నది ముఖ్యం కదా.?
న్యూస్ ఛానళ్ళలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్న వైనం నిత్యం చూస్తూనే వున్నాం. వివిధ మతాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు నిత్యకృత్యం. ప్రధానంగా హిందూ మతం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది.
‘రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పొందాడు.?’ అంటూ తమిళనాడుకి చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు అప్పట్లో ప్రశ్నించాడు. ‘రామసేతు’ వివాదానికి సంబంధించి ఆయనలా మాట్లాడాడు. అప్పట్లో, ఆయన్ని ఎవరూ అరెస్టు చేయలేదు.. ఆయన మీద ఏ న్యాయస్థానమూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆ వ్యాఖ్యల వల్ల ప్రపంచ దేశాలేవీ, భారతదేశాన్ని తప్పు పట్టలేదు.
తెలుగునాట ఓ రాజకీయ ప్రముఖుడు, పైగా ఓ మంత్రి.. ‘విరిగింది ఆంజనేయస్వామి బొమ్మకు సంబంధింని చెయ్యే కదా..’ అంటూ ఎగతాళి చేశాడు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నీ అమ్మ మొగుడు కట్టించాడా.?’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడాయన. ఏం, ఏ న్యాయస్థానమైనా ఆయన్ని తప్పు పట్టిందా.? హిందూ సమాజానికి, భారతదేశానికి బేషరతు క్షమాపణ చెప్పాలని తీర్మానించిందా.?
ఇలా జరుగుతోంది దేశ ప్రజల్లో చర్చ. నుపుర్ శర్మ చేసింది ముమ్మాటికీ తప్పే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఏ మతం మీద ఏ రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. వాటినీ నేరాలుగానే పరిగణించాలి కదా.?