నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించాడో.. ఎన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమిని అధికారంలోకి తేవడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డ వారిలో లోకేష్ కూడా ముందుంటాడు. అలాంటి లోకేష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందుబాటులో ఉండకపోయినా కూడా.. లోకేష్ ప్రజాదర్బార్ పేరుతో ప్రజలకు నిత్యం దగ్గరే ఉంటున్నాడు. ఇప్పటి వరకు వేల మందికి ఆయన సాయం చేస్తున్నాడు.
కానీ దానికి పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు. ఇక విజయవాడ వరదల సమయంలో కూడా లోకేష్ సైలెంట్ గానే పని చేసుకున్నారు. విజయవాడలోనే ఉండి బాధితులకు సాయం అందించాడు. కానీ దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో కూడా చాలా వరకు సైలెంట్ గానే ఉండిపోయాడు. దాంతో లోకేష్ పేరు లడ్డూ విషయంలో పెద్దగా వినిపంచలేదు. చివరకు లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. కల్తీ జరిగిందనడానికి ఆధారాలు ఏవి అంటూ ప్రశ్నిస్తే.. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ కూడా చేతులు పైకెత్తేశారు.
దీంతో ఈ విషయంలో బాగా ప్రచారం అయిన వారిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కానీ లోకేష్ పై మాత్రం రావట్లేదు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ హైలెట్ ఉంటున్నారు. కాబట్టి తాను మూడో పవర్ సెంటర్ కాకూడదనే ఉద్దేశంతోనే లోకేష్ ఇలా సైలెంట్ గా ఉంటున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ తీరు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.