నాని అంటే సినిమా హీరో కాదు, మన పొరుగింటబ్బాయ్. అవును, మన వీధిలోనో.. మన ఇంట్లోనో కన్పించే ఓ సాధారణ కుర్రాడిలానే కన్పిస్తాడు నాని. అందుకే నేచురల్ స్టార్ నాని.. అంటున్నాం. ‘ఎంసీఏ’ పరమ రొటీన్ సినిమా.. ఆ సినిమాతో మంచి హిట్టు కొట్టేశాడు. ‘నేను లోకల్’ కూడా అంతే. రొటీన్‌కి భిన్నంగా సినిమాలు చేయడా.? అంటూ నాని మీద విమర్శలొచ్చాయి.. వెరైటీ సినిమాలు చేసినప్పుడేమో, ‘అబ్బే.. కమర్షియల్ స్టామినా ఎక్కడ.?’ అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయాలన్నిటినీ బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నాడు నాని.. అందుకే తన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియా ముందుకొచ్చి.. అన్నిటికీ సమాధానాలు చెప్పేశాడు. నాని సమాధానాల్లో ఒకింత ‘అసహనం’ కన్పించిందనే చర్చ అందరిలోనూ జరుగుతోంది. కానీ, వాస్తవం వేరు. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కాస్తా, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ అవడం నానికి కొంత ఇబ్బందికరమైన అంశమే.. కానీ, తప్పలేదు.
పైగా, దీన్నొక కాపీ సినిమాగా అభివర్ణిస్తున్నారు. ఇకనేం, నానికి చాలా కోపమే వచ్చేసింది. ఆ కోపాన్ని అలాగే దాచేసి, సరదాగా సెటైర్లు వేసేశాడు. ‘కాపీ అనేయడం చాలా తేలిక.. సినిమా చూసి కాపీనో కాదో తెలుసుకోవడం మంచిది..’ అంటూ నాని ఓ చురకేశాడు. అన్నట్లు, ఈ మధ్య సినిమా స్టార్ట్ అవుతున్నా.. అది ఫలానా సినిమాకి కాపీ.. అన్న ప్రచారం తెరపైకొచ్చేస్తోంది. కొన్ని సినిమాల విషయంలో ఇది నిజమవుతోంటే, మరికొన్ని సినిమాల విషయంలో అంచనాలు తప్పవుతున్నాయి.
Also Read: నాని ఇంత కన్నింగ్ అనుకోలేదబ్బా !!
మొత్తమ్మీద, నాని కూల్‌గానే తన ‘కూల్‌నెస్’ కొంచెం కోల్పోయాడన్నమాట. తప్పదు.. అతను ఫేస్ చేస్తున్న ట్రబుల్స్ అలాంటివి. ఆ విషయాలు పక్కన పెడితే, ‘గ్యాంగ్ లీడర్’ పెద్ద హిట్ అవడం ఖాయమని అభిమానులకు భరోసా ఇస్తున్నాడు నాని. అందుకు తగ్గట్టుగానే సినిమాని భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ‘గ్యాంగ్ లీడర్’ చాలా బిగ్ రిలీజ్‌గా (నాని కెరీర్‌లో) రికార్డులకెక్కబోతోందని సమాచారమ్.
