Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఐటీ దాడులు.. టీడీపీ మీదనే ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఆదాయపు పన్ను శాఖ.. ఎప్పటికప్పుడు తమకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంటుంది. అది వారి విధి. అయితే, ఈ మధ్య ఆదాయపు పన్ను శాఖ సోదాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్‌పై ఐటీ సోదాలు జరిగాయి. ఆ వెంటనే, బీజేపీ శ్రేణులు విజయ్‌కి వ్యతిరేకంగా నినదించడమే కాదు, విజయ్‌ నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.

ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు టీడీపీ నేతలకు సంబంధించిన సంస్థలపై సోదాలు నిర్వహించింది ఆదాయపు పన్నుశాఖ.. ఈ వ్యవహారం మళ్ళీ వివాదాస్పదమవుతోంది. టీడీపీ – బీజేపీ మధ్య వైరం గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయితే, ఈ సోదాల్ని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సబబు.? అన్నది ఆలోచించాల్సిన విషయం.

‘ఆదాయపు పన్ను శాఖ అనేది కేంద్రం పరిధిలోనిది.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఎవరి ప్రమేయంతోనూ సోదాలు, తనిఖీలు నిర్వహించవు..’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. అదే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రేరణతోనే వైఎస్‌ జగన్‌ మీద సీబీఐ ద్వారా కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించిన విషయం విదితమే. ఇప్పటికీ ఆ ఆరోపణలకే వైఎస్సార్సీపీ కట్టుబడి వుంది.

ఎవరు అధికారంలో వుంటే, వారికి అనుకూలంగా ఆయా దర్యాప్తు సంస్థలు పనిచేస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానమే అసహనం వ్యక్తం చేసింది. మరోపక్క, ఐటీ సోదాల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న చర్చ కూడా ఇంకో వైపు జరుగుతోంది. ‘దేశంలో ఇలాంటివి చాలా చాలానే జరిగాయి.. ఆ తర్వాత అవన్నీ నీరుగారిపోయాయి..’ అంటూ కొన్ని ఉదంతాల్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావించడం చూస్తున్నాం.

ఏదిఏమైనా, తాజా ఐటీ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. పైకి బుకాయిస్తున్నా, తెరవెనుకాల తెలుగుదేశం పార్టీ కుతకుతలాడిపోతోంది దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంపై. ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ఇప్పటికే టీడీపీ బృందం ఓ నిర్ణయానికి వచ్చింది.

పైకి ‘రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్రానికి ఫిర్యాదు’ అని చెబుతున్నా, ప్రధాని వద్దకు రాయబారం కోసం పార్టీ నేతల్ని చంద్రబాబు పంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా, టీడీపీ ప్రస్తుతం ఐటీ దెబ్బకు విలవిల్లాడుతుండడాన్ని చూసి వైఎస్సార్సీపీ సంబరపడిపోవడానికి వీల్లేదు. రేప్పొద్దున్న వైసీపీ కూడా ఈ తరహా దెబ్బల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...