వైఎస్ జగన్ మీద ట్వీట్లెయ్యడానికి టాలీవుడ్ ఎందుకు భయపడింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,301FansLike
57,764FollowersFollow

అరరె.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సినీ నటి సమంతపై వాడకూడని పదజాలంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేశారే.! ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న నాగార్జున, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డాడే.! నాగచైతన్య, అఖిల్, అమల కూడా స్పందించేశారే.!

స్పందించాల్సిందే.. అంత దారుణమైన పదజాలాన్ని కొండా సురేఖ ఉపయోగించారు మరి.! మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీటేశారు. జూనియర్ ఎన్టీయార్, మహేష్‌బాబు, విశ్వక్ సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. దాదాపుగా సినీ ప్రముఖులంతా స్పందించేశారు. కొండా సురేఖ తీరుని తప్పు పట్టారు కూడా.

మంచిదే.! సినీ పరిశ్రమలో ఈ ఐక్యత వుండి తీరాలి. కాకపోతే, అందరి విషయంలోనూ ఇలాగే సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చి వుంటే బావుండేది. పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీరెడ్డి తూలనాడినప్పుడు ఈ సినీ పరిశ్రమ ఏమైపోయింది.? అంతకన్నా చాలాకాలం ముందర, చిరంజీవి మీద రోజా మాటలు తూలినప్పుడు, సినీ ప్రముఖులంతా ఎక్కడికి పోయారు.?

అంతెందుకు, గడచిన ఐదేళ్ళ కాలంలో అనునిత్యం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అప్పట్లో మంత్రులుగా పని చేసిన రోజా, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని.. ఇలాంటోళ్ళంతా సినీ పరిశ్రమపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందిస్తూ వచ్చారు. చిరంజీవి నొచ్చుకున్నారు.. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, ఇప్పుడు.. సమంత విషయంలో ట్వీట్లుస్తున్న సినీ ప్రముఖులు అప్పుడంత ఎందుకు మౌనం దాల్చినట్లు.?

నమ్రత మీద అప్పట్లో వైసీపీకి చెందిన సాక్షి మీడియా జుగుప్సాకరమైన రాతలు రాస్తే, మహేష్ స్పందించలేకపోయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీయార్ మేనత్త భువనేశ్వరి మీద అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, స్పంచడానికి జూనియర్ ఎన్టీయార్ చాలా కష్టపడ్డాడు.

సమస్య వచ్చినప్పుడు స్పందించి తీరాలి. కలిసికట్టుగా స్పందించాలి. సమంత విషయంలో సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చింది కాబట్టే, మంత్రి కొండా సురేఖ బేషరతు క్షమాపణ చెప్పారు. ఇదే క్షమాపణ జగన్‌తో సినీ పరిశ్రమ ఎందుకు చెప్పించలేకపోయింది.? రోజా, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని వంటివారితో క్షమాపణ చెప్పించడానికి సినీ ప్రముఖులకు ఏ బేషజాలు అడ్డొచ్చాయ్.

అన్నట్టు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు స్పందించేసింది. మరి, గతంలో.. అంటే, పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు ‘మా’ స్పందించలేదు.? చిరంజీవి విషయంలో ‘మా’ ఎందుకు స్పందించలేదు.?

ఏదిఏమైనా, తెలుగు సినీ పరిశ్రమకి ఇదొక గుణపాఠం లాంటిది. పరిశ్రమ మీద తేలిక వ్యాఖ్యలు చేయడం, జుగుప్సాకరంగా ప్రవర్తించడం రాజకీయ నాయకులకి అలవాటైపోయింది. ఇప్పటికైనా, ‘మేమంతా ఒక్కటే.. మేమంతా కలిసి మా కోసం పోరాడతాం’ అని సినీ పరిశ్రమ అనగలిగితే మంచిది.!

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

లీన్ లుక్ తర్వాతే ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్ ప్లాన్ ఇదే

పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించిన అభిమానులకు తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పూర్తిగా లీన్ లుక్ సాధించిన తర్వాతే ‘స్పిరిట్’...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన సభ్యత్వ జోరు

తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్ చరణ్

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్ లా బ్లాస్ట్ అయింది. ప్రతిఒక్కరూ రామ్...