Switch to English

అయ్యయ్యో విరాట్‌ కోహ్లీ.. ‘తప్పు’ ఎక్కడ జరిగింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

న్యూజిలాండ్‌ టూర్‌లో టీమిండియా వన్డే సిరీస్‌ని కోల్పోయింది.. తాజాగా టెస్ట్‌ సిరీస్‌ని కూడా కోల్పోయింది. ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు ఆకాశానికెత్తేయడం.. ఓడినప్పుడు పాతాళానికి తొక్కేయాలని చూడటం సర్వసాధారణమే. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని విమర్శకులు పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారంటే, అందుక్కారణం టీమిండియా సారధి న్యూజిలాంట్‌ టూర్‌లో వరుసగా విఫలమవుతుండడమే. అయితే, న్యూజిలాండ్‌లో పిచ్‌ కండిషన్స్‌ భిన్నంగా వుంటాయి.

అలాగని టీమిండియా తప్పిదాలు చేయలేదని కాదు. గెలిచే మ్యాచ్‌లని టీమిండియా చేజార్చుకుంది. అదే టీమిండియా వైఫల్యానికి కారణం. కెప్టెన్‌ కోహ్లీనే కాదు, జట్టులో చాలామంది విఫలమయ్యారు. కానీ, బాధ్యత కెప్టెన్‌దే కదా.! విజయాల సారధి.. అని ఎలా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆకాశానికెత్తేశారో, అలాగే జట్టు పరాజయాల పాలవుతున్నప్పుడు కెప్టెన్‌నే నిందిస్తారు. ఆ విషయం కోహ్లీకి కూడా తెలుసు.

కాగా, కెప్టెన్‌ కోహ్లీకి జట్టులోని ఇతర సభ్యులు బాసటగా నిలుస్తున్నారు. ‘బౌలర్లం రాణించాం కాబట్టి, తప్పిదం బ్యాట్స్‌మెన్‌దేనని చెప్పబోం. ఎందుకంటే, మేం ఫెయిలయినప్పుడు బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటి మ్యాచ్‌లను గెలిపించారు కదా..’ అని టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇప్పటికే వ్యాఖ్యానించి వున్నాడు. ఇదిలా వుంటే, వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపిక అతి పెద్ద తప్పిదంగా చెప్పుకోవచ్చు. ఓపెనింగ్‌ జోడీ సరిగ్గా లేకపోవడం సహా జట్టు కూర్పులో లోపాలు టీమిండియా విజయావకాశాల్ని దెబ్బ తీశాయి.

చిత్రంగా పుజారా కూడా న్యూజిలాండ్‌ గడ్డపై చేతులెత్తేశాడు. ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, డాషింగ్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ లేకపోవడం, మంచి ఫావ్‌ులో వున్న కెఎల్‌ రాహుల్‌ని పక్కన పెట్టడం.. ఇవన్నీ టీమిండియా ఘోర పరాజయాలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఓ వన్డే సిరీస్‌, ఓ టెస్ట్‌ సిరీస్‌ కోల్పోగానే కెప్టెన్‌ కోహ్లీపై అర్థం పర్థం లేని విమర్శలు చేయడం సబబు కాదు. అదే సమయంలో, జట్టుకి తానే ప్రధాన బలం కాబట్టి.. కోహ్లీ తన ఫావ్‌ుపై దృష్టిపెట్టాల్సి వుందన్నదీ నిస్సందేహం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...