ఎన్టీఆర్ నుంచి చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన దేవర మూవీ హిట్ అయింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి కలెక్షన్లు బాగానే వచ్చినప్పుడు వచ్చినవి చెప్పుకుంటే సరిపోతుంది కదా.. అలా కాకుండా ఏదో భారీ హైప్ ఇవ్వాలనే అత్యుత్సాహంతో నమ్మలేని విధంగా కలెక్షన్ల పోస్టర్లు వేసేసి ఎందుకీ హడావిడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. నైజాం ఏరియాలో దేవర మూవీని రూ.45 కోట్లకు అమ్మారు. కానీ మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లు ఈ ఏరియాలో వచ్చేసినట్టు పోస్టర్లు వేసేస్తున్నారు పీఆర్ టీమ్.
ఇక దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి మరింత నెంబర్లు పెంచేసి ఫేక్ పోస్టర్లు వేస్తారేమో. అలా ఎందుకు చేయడం. ఈ ఏరియాలో మొదటి రోజు రూ.14 కోట్లు మూవీ వసూలు చేసింది. రెండో రోజు ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ నెంబర్లు చెప్పుకుంటేనే చాలా బెటర్. కానీ రెండు రోజుల్లోనే మరో పది కోట్లు వీరే ఆడ్ చేసుకుని చూపించుకోవడం ఎన్టీఆర్ ను ట్రోల్ చేయించడానికేనా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఒక్క చోటనే కాదు చాలా చోట్ల పీఆర్ టీమ్ వాళ్లు వచ్చిన వసూళ్లకు మరో ముప్పై శాతం పెంచేసి పోస్టర్లు వేసేస్తున్నారు.
దాంతో ఈ పోస్టర్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇంత మంచి సినిమాకు కలెక్షన్లు వచ్చినవి వేసుకుంటే ఇంకా మంచి క్రేజ్ పెరిగేది. అలా కాకుండా వచ్చిన హైప్ ను చెడగొట్టడానికే ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేస్తున్నారా అని మండిపడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.