Switch to English

జస్ట్ ఆస్కింగ్: అసలు చంద్రబాబు రాజకీయ నాయకుడేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

జనాన్ని ఉద్దేశించి విపరీతమైన వెటకారాలు చేయడం ఏ రాజకీయ నాయకుడికీ తగదు. ప్రజల్ని చైతన్యపరచాలి.. ప్రజల్ని నమ్మించగలగాలి.. ఇవీ రాజకీయ నాయకుడు చేయాల్సిన పనులు. దురదృష్టవశాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రజల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగాడని ఇచ్చారు కదా.. మీకు ఇలాగే జరగాలి.. నేను చెబితే వినలేదు. వైసీపీని గెలిపించినందుకు తగిన శాస్తి జరిగింది..’ అంటూ చంద్రబాబు, ఎన్నికల ప్రచారంలో ‘ముందుకు పోతున్నారు’. ఇదెక్కడి రాజకీయం.? ఓటర్లకు రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ డబ్బు పంచడం అనేది ఓ తప్పనిసరి వ్యవహారంగా మారిపోయిందంటే, దానికి ఆద్యుడు చంద్రబాబేనన్న విమర్శలున్నాయి. ఇప్పుడు అదే చంద్రబాబు, ‘డబ్బులు తీసుకుని ఓట్లేస్తే ఇలాగే వుంటుంది..’ అంటూ జనాన్ని నిలదీస్తున్నారు. అందుకేనేమో, చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంటే, అటువైపుగా వెళ్ళేందుకూ జనం అయిష్టత ప్రదర్శించాల్సి వస్తోంది.

తాజాగా గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు, ప్రజల మీద విరుచుకుపడ్డారు. వైసీపీని ఓడిస్తే తప్ప, మేలు జరగదంటూ నినదించారు. వైసీపీ మీద చంద్రబాబు విమర్శలనేవి.. రాజకీయంలో భాగం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ, జనం మీద చంద్రబాబు విరుచుకుపడటమేంటి.? ఐదేళ్ళు అధికారం ఇస్తే, చంద్రబాబు ఏం చేశారు.? విజయవాడ, గుంటూరు నగరాల్లో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏంటి.? ఆ రెండు నగరాల మధ్య నిర్మితమవ్వాల్సిన అమరావతి మాటేమిటి.?

ఐదేళ్ళు పబ్లసిటీ స్టంట్లు చేసి, ఎన్నికలు రాగానే.. మాట మార్చి.. కేంద్రంపై రాజకీయ దాడి షురూ చేసి, ప్రతిపక్షం మీద విరుచుకుపడి, పొరుగు రాష్ట్రంలోని అధికార పార్టీపైనా రెచ్చిపోయి.. జనాల్ని దూరం చేసుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. తాను చేసిన తప్పులకి, ప్రజల్ని నిందించడం చంద్రబాబుకి అలవాటేగానీ, మరీ ఇంత దారుణంగానా.? అసలు చంద్రబాబు రాజకీయ నాయకుడేనా.? ఏమైపోయింది ఆయనగారి రాజకీయ అనుభవం.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...