స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, జైల్లో వున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బెయిల్ కోసం ప్రయత్నించడంలేదా.? ఈ విషయమై రాజకీయ వర్గాల్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నారు.
రాజకీయ నాయకులనే కాదు, ప్రముఖులెవరైనా అరెస్టయ్యే అవకాశం వుందన్న అనుమానం వస్తే చాలు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, వైసీపీ నేత, ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. హత్య కేసులోనే ముందస్తు బెయిల్‌కి ఆస్కారం వున్నప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించలేదు.?
వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థుడన్న గుర్తింపు చంద్రబాబుకి వుంది. కానీ, చంద్రబాబు అలా ముందస్తు బెయిల్ కోసం కాదు కదా, అరెస్టయ్యాక బెయిల్ కోసం కూడా ప్రయత్నించడంలేదట.! ప్రస్తుతం వాదనలన్నీ రిమాండ్ చుట్టూనే తిరుగుతున్నాయి. హౌస్ రిమాండ్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.
అంటే, చంద్రబాబుని ఇంటిలోనే వుంచి, రిమాండ్ కొనసాగించాలన్నది ఆయన తరఫు న్యాయ వాదుల వాదన. దాన్ని ఎటూ సీఐడీ తరఫు లాయర్లు సమర్థించరు.. విభేదిస్తుంటారు. సో, వ్యవహారం అలా అలా నడుస్తుంటుందన్నమాట. బెయిల్ తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి (రిటైర్డ్) ఒకరు, సోషల్ మీడియా వేదికగా, చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నించకపోవడం ఆశ్చర్యకరం వుందంటూ ట్వీట్ వేశారు. సీబీఐలో ఆయన ఉన్నతాధికారిగా అత్యున్నత స్థానంలో పని చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కి సంబంధించి ఆధారాల్లేకుండా అరెస్టు చేశారనేది ఎస్టాబ్లిష్ చేయడం చంద్రబాబు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
రిమాండ్ ఖైదీగా వున్నా, నిలబడని కేసు తన మీద పెట్టారని వీలైనంత వేగంగా నిరూపించే ప్రయత్నంలోనే చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నించడంలేదని అర్థం చేసుకోవాలా.?
What i don’t unjderstood iss actually hhow you arre noww
noot actually a lott morre well-favored than yoou may be right now.
Yoou aare so intelligent. Yoou rrealize thus significdantly on the sbject off thhis matter, made
mee individually imagijne iit frokm a loot of varijous angles.
Its lke meen andd women are nott fascinated except it’s something to accomplish with Girl gaga!
Your personal styuffs great. At aall times cafe for iit up!