Switch to English

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.? ప్రభుత్వమే ఆన్‌లైన్ అమ్మకాల కోసం వెబ్ సైట్ ఏర్పాటు చేయడమేంటి.?

సరే, సినీ పరిశ్రమకు సంబంధించి అక్రమాలే జరుగుతున్నాయనుకుందాం.. పన్నులు ఎగ్గొడుతున్నారే అనుకుందాం.. టిక్కెట్ల ధరల్ని అడ్డగోలుగా పెంచేస్తున్నారే అనుకుందాం.. వాటిని పర్యవేక్షించడానికి వివిధ విభాగాలు వున్నాయ్ కదా.? అవి సరిగ్గా పని చేయడంలేదని ప్రభుత్వం చెప్పదలచుకుంటోందా.? ఏమోగానీ, సినిమా టిక్కెట్ల ధరల విషయమై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

సగటు సినీ ప్రేక్షకుడు సినిమాని ఉచితంగానే చూడాలని అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, సినిమా టిక్కెట్ అంతలా భారమైపోయింది వివిధ కారణాలతో. అసలు సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లడానికి కారణమెవరు.? ఛోటా మోటా రాజకీయ నాయకులే కదా.? సినిమా టిక్కెట్ల దందాతో రాజకీయాల్లో రాణించిన మహానుభావులెందరో వున్నారు. వాళ్ళంతా ఈ వ్యవహారం చూసి సైలెంటుగా వున్నారంటే, కథ పెద్దదే వుండి వుండాలి.

సరే, ఆ సంగతి పక్కన పెడదాం.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. కొన్ని నల్ల బజార్లకు తరలి వెళుతున్నాయ్. అంతెందుకు, కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రాణాధార మందుల ధరలు పది రెట్లు, వంద రెట్లు కూడా పెరిగిన పరిస్థితిని చూశాం. కల్తీ వ్యాక్సిన్లు కూడా సందడి చేశాయి. ఆక్సిజన్ సిలెండర్ల సంగతి సరే సరి. అలాంటి విషయాల్లో ప్రభుత్వం ‘ఆన్ లైన్’ అనే ఆలోచనే ఎందుకు చేయలేదు.?

అయితే, అక్కౌంట్లలో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులేయడం.. లేదంటే, సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని చెప్పడం. మటన్ మార్టుల ఐడియాలు.. ఇంకేవేవో వింతలూ, విడ్డూరాలు. అంతే తప్ప, రోడ్లను బాగు చేద్దామన్న ఆలోచన వుండదు.. అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యమే వుండదు. అప్పు చేసి సంక్షేమ కూడు.. ఆపైన, తుగ్లక్ నిర్ణయాలు.. ఈ పాలన నభూతో నభవిష్యతి.. అనాలేమో.!

సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి ఓ చర్చ జన బాహుళ్యంలో గట్టిగా నడుస్తోంది. ‘ఒకరి కష్టార్జిత సంపాదన మార్గంపై దెబ్బ కొట్టేందుకు.. కక్ష సాధింపు చర్యలు చేపట్టేందుకు.. ప్రత్యామ్నాయ శక్తి మనుగడ, అస్తిత్వం లేకుండా చేసేందుకు.. అనవసర అనాలోచిత అసందర్భ చర్యలతో ఒక పరిశ్రమ మొత్తాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న ప్రభుత్వం.. నైతికంగా ఎదుర్కోలేకా.? అధికారముంది కాబట్టి ఏమైనా చేసేందుకా.?’ అన్నదే ఆ చర్చ తాలూకు సారాంశం. అరచేతిని అడ్డుపెట్టి, సూర్యుడిని ఆపేయాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీలు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

యాదాద్రీశుడిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు..!

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని...

డ్రగ్స్ అలా.. గంజాయి ఇలా.. ఎవరిది ఈ పాపం.?

పొరుగు రాష్ర్టాల నుంచి మధ్యం బాటిళ్లు అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కానీ, తనిఖీల కళ్లు కప్పి పొరుగురాష్ట్రల నుంచి మధ్యం యధేచ్చగా రాష్ట్రంలోకి...

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...