మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమా మెగా మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు.
ఐతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తారంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ వేట కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
ఆల్రెడీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి నటించింది. మళ్లీ చిరు సినిమాకు కూడా ఆమెనే తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఒకప్పుడు సీనియర్స్ తో నటించడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపించే వారు కాదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది యువ హీరోయిన్స్ కూడా తమ కెరీర్ కు ప్లస్ అవుతుందని సీనియర్ స్టార్స్ తో జత కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి జతగా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ ప్లాన్ చేస్తున్నారు.