Switch to English

వైసీపీ వర్సెస్ టీడీపీ: దిష్టి బొమ్మ ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి అమర్‌నాథ్‌కి సోషల్ మీడియాలో వున్న పేరు ‘కోడి గుడ్డు అమర్నాథ్’ అని. ఆ పేరు ఆయనకి ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాభివృద్ధి విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కోడి గుడ్డు పెట్టింది, అది పొదిగి, కోడి పిల్ల అవడానికి సమయం పడుతుంది.. అని వెటకారంగా గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు ‘గుడ్డు అమర్నాథ్’ అనే పేరు వచ్చింది.

సరే, రాజకీయాలన్నాక విమర్శలు, ఇలాంటి వెటకారపు ర్యాగింగులు సర్వసాధారణం. మంత్రిగా పని చేసిన సమయంలో గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఉపయోగపడిన కార్యక్రమాలు ఏమైనా చేశారా.? అంటే, ఒక్కటి కూడా ఆయన చెప్పుకోలేరు. వైసీపీ హయాంలో మంత్రులంతా రబ్బర్ స్టాంపులు.. పేపర్ వెయిట్స్ మాత్రమే.

అంతా సకల శాఖల మంత్రిగా తెరవెనుకాల కథ నడిపిన వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. నిజానికి, వైసీపీ హయాంలో అసలంటూ రాష్ట్ర అభివృద్ధి శూన్యమనే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం కూడా తీర్పునిచ్చారు.

వైఎస్ జగన్ హయాంలో జగనన్న గోరు ముద్ద, జగనన్న కాలనీలు.. ఇలా అన్నిటికీ తన పేర్లే పెట్టుకున్నారు. కొన్నిటికి తన తండ్రి పేర్లు పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టుని గాలికొదిలేసి, ఆ ప్రాజెక్టు దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెడతామంటూ ప్రకటించుకున్న ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది.

విశాఖలో కాపురం వుండడం కోసం, విశాఖ సముద్ర తీరాన రుషికొండపై భారీ భవంతిని ప్రజాధనంతో నిర్మించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదిప్పుడు, విశాఖకు దిష్టిబొమ్మలా తయారయ్యిందన్న చర్చ అంతటా జరుగుతోంది. ఇదంతా అదే విశాఖకు చెందిన గుడివాడ అమర్నాథ్‌కి తెలియనిది కాదు.
కానీ, టీడీీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ‘నారా వారి దిష్టిబొమ్మ’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. వైసీపీ హయాంలో చేసేసినవాటికి చంద్రబాబు క్రెడిట్ తీసేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది అమర్నాథ్ ఆరోపణ.

భోగాపురం విమానాశ్రయం విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు.. అవన్నీ 2014-2019 మధ్య ప్రారంభించబడినవే. వైసీపీ హయాంలో ఆ పనులు కొంత మేర కొనసాగి వుండొచ్చు. ప్రభుత్వం శాశ్వతం, ఎవరు అధికారంలో వున్నా. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.

ఇక, దిష్టిబొమ్మల వ్యాఖ్యల విషయానికొస్తే, వైసీపీ దిగజారుడుతనాన్ని ప్రజల గమనిస్తున్నారు. ఈ తీరు కారణంగానే వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీంగిల్ డిజిట్‌కి పడిపోవాలని బహుశా వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోందేమో అనిపిస్తోంది గుడివాడ అమర్నాథ్ దిష్టిబొమ్మ వ్యాఖ్యల నేపథ్యంలో.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

ఈ వారం ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వర్షం!

ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలకు వస్తుండటంతో డిజిటల్ ప్రేక్షకులకు వినోదోత్సవం మొదలైంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...

Daily Horoscope: మేషంలో లాభయోగం, సింహంలో కెరీర్ ముందడుగు

ఫిబ్రవరి 16, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. చిన్న ప్రయాణాలు లాభం...