Switch to English

ప్రాణం తీసిన రైలు పట్టాలు: ఈ పాపం పాలకులదే..

రైలు పట్టాలపై నడిచి వెళ్ళడం నేరం. కానీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళాలంటే అదొక్కటే మార్గం. ఏ క్షణాన రైలు తమ మీదకు దూసుకొస్తుందోనన్న భయం ఓ పక్క వున్నా, లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి లేక, ఆకలి చావులకు భయపడి, సొంతూళ్ళకు వెళుతున్న చాలామంది ఆ రైలు పట్టాల్నే ఎంచుకుంటున్నారు తమ ప్రయాణ మార్గాలుగా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితిని చూస్తున్నాం.

కానీ ఔరంగాబాద్‌లో ఓ రైలు 15 మంది అభాగ్యుల ప్రాణాల్ని బలిగొంది. రైలు డ్రైవర్‌ (లోకో పైలట్‌) అప్రమత్తంగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమన్న వాదనను రైల్వే శాఖ కొట్టి పారేసింది. రైలు డ్రైవర్‌, పట్టాలపై జనాల్ని గుర్తించినప్పటికీ, రైలుని అదుపు చేయడం సాధ్యం కాలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రధాని ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిన్న విశాఖలో గ్యాస్‌ లీక్‌.. ఈ రోజు రైలు పట్టాలపై ఆవిరైపోయిన ప్రాణాలు.. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం మామూలే. కానీ, నేరం ఎవరిది.? లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళేందుకు అభాగ్యులకు అనుమతినివ్వని ప్రభుత్వాల్నే ఇక్కడ తప్పుపట్టాల్సి వుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, కూలీలను ఆదుకోవడంలో విఫలమవడంతోనే ఈ దుస్థితి దాపురించింది.

ఇదొక్కటే కాదు.. వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళుతున్నారు చాలామంది. నిండు గర్భిణి.. బాలింత.. ఇలా ఒకరేమిటి.? రోడ్లపై, రైలు పట్టాలపై అభాగ్యులు ఎందరో కన్పిస్తున్నారు. మనిషిలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. అందుకే, సాటి మనిషిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. సొంతూళ్ళకు పయనమైనవారికి మార్గమద్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు.

కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం తప్ప, ప్రభుత్వాల సాయం చివరి వ్యక్తి వరకూ చేరకపోవడంతోనే ఈ దుస్థితి. లాక్‌డౌన్‌ ప్రకటించేశాం.. మీ చావు మీరు ఛావండి.. అని కేంద్రం వ్యహరించబట్టే ఈ దుస్థితి.. అంఉటన్న విపక్షాల విమర్శల్ని తేలిగ్గా ఎలా కొట్టి పారేయగలం.?

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

‘‘లవ్ స్టోరీ’’ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...