ఎవరు ఎవరిని పెద్దవారిని చేస్తున్నారు? ఏది మంచి? ఏది చెడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,257FansLike
57,764FollowersFollow

ఇది ఒక చిత్రం!:

ఇటీవల ఓ యూఎస్‌ బేస్డ్‌ రివ్యూయర్‌ చుట్టూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జరుగుతున్న హడావిడి చూస్తుంటే ఒక ప్రశ్న వస్తోంది. నిజంగా అతడిని పెద్దవాడిని చేస్తున్నది ఎవరు?

ఒక సినిమా నచ్చకపోతే విమర్శించడం, నచ్చితే ప్రశంసించడం రివ్యూయర్ల పని. అదే విధంగా ఆ విమర్శలు తప్పు అనిపిస్తే చట్టపరంగా స్పందించడం నిర్మాతల హక్కు. ఈ రెండు వర్గాల మధ్య ఏదైనా వివాదం ఉంటే వారు చూసుకుంటారు. కానీ మధ్యలో సోషల్ మీడియా యూజర్లు, కొందరు మీడియా హ్యాండిల్స్ మాత్రం ఆ రివ్యూయర్ గురించే రోజంతా పోస్టులు, ట్వీట్లు, వీడియోలు చేస్తూ ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

అతడిని విమర్శిస్తూ అయినా, తిడుతూ అయినా, అతడి పేరును పదే పదే ప్రస్తావిస్తూ అయినా చివరికి లాభం ఎవరికీ? అతడికే కదా. అతడి ట్యాగ్‌లు పెట్టడం, హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేయడం, అతడిపై వీడియోలు చేయడం, ప్రత్యేక కథనాలు రాయడం… ఇవన్నీ చివరికి అతడి రీచ్‌ను, గుర్తింపును మరింత పెంచేవే.

నిజానికి ఇలాంటి కంటెంట్ క్రియేటర్లకు కావాల్సింది కూడా అదే. ప్రజలు తమ గురించి మాట్లాడాలి. అనుకూలంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా పేరు వినిపిస్తే చాలు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. కొద్ది రోజుల క్రితం వరకు ఒక వర్గానికే తెలిసిన వ్యక్తి గురించి ఇప్పుడు వేలాది మంది మాట్లాడుతున్నారు. అంటే అతడికి కావాల్సిన మైలేజ్ వచ్చిందన్న మాట.

అతడిని ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే విమర్శల కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు అతడిని అడ్డుకోవాలనుకుని చేస్తున్న ప్రయత్నాలే అతడికి అదనపు గుర్తింపును తీసుకొస్తున్నాయి.

ఇది మరో విచిత్రం:

పరిశ్రమలో ఇంకో ఆసక్తికరమైన సంస్కృతి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కువ విమర్శలు చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కంటెంట్ ఇస్తారో వారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. నిర్మాతలు, పీఆర్‌వోలు, సినిమా వర్గాలు కూడా అలాంటి వారినే ఎక్కువగా పట్టించుకుంటాయి. అన్నిట్లో పెద్ద పీట వారికే వేస్తారు.  ఎందుకంటే వారి చుట్టూ ఎప్పుడూ చర్చ ఉంటుంది. వారికి వ్యూస్ ఉంటాయి. రీచ్ ఉంటుంది.

అదే సమయంలో పరిశ్రమ బాగుండాలని, ఎవరికీ నష్టం జరగకూడదని,  సమతుల్యంగా వ్యవహరించే మీడియా సంస్థలు లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం చాలాసార్లు పక్కన పడిపోతుంటాయి.  నిర్మాతలు, పీఆర్‌వోలు, సినిమా వర్గాలు గానీ.. వారి వైపు కన్నెత్తి చూడరు. వారి గురించి మాట్లాడేవాళ్లు కూడా తక్కువగానే ఉంటారు.

అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే. విమర్శలతో, వివాదాలతో పేరు తెచ్చుకోవడం మంచిదా? లేక బాధ్యతతో వ్యవహరిస్తూ నిశ్శబ్దంగా పని చేయడం మంచిదా? సమాధానం ఎవరి దృష్టిలో వారిది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఎవరిని విమర్శిస్తున్నామో కంటే… ఆ విమర్శల వల్ల ఎవరికి లాభం కలుగుతుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

సినిమా

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో...

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’...

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ...

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం,...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

రాజకీయం

“రావణ్‌, ప్రకాశ్ రాజ్‌లను ఎవరు సమర్థిస్తున్నారు?”.. విజయసాయిరెడ్డి సంచలన ప్రశ్నలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రావణ్ జోసెఫ్, ప్రకాశ్ రాజ్ పేర్లను ప్రస్తావిస్తూ, వారిని ఎవరు...

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి: సనాతన ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను...

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

నల్లమలలో బయటపడిన అమరావతి చరిత్ర.. పవన్ కళ్యాణ్ హర్షం

నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో ఈ...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎక్కువ చదివినవి

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి: సనాతన ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను...

చివరి కోరిక నెరవేరింది.. చిన్నారి నిరంజన్ ఇక లేడు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో చాలా కాలంగా పోరాడుతున్న హనుమకొండకు చెందిన పోనుగంటి నిరంజన్ కన్నుమూశాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ తన చివరి కోరికగా అభిమాన నటుడిని ఒకసారి కలవాలని కోరుకున్నాడు....

Daily Horoscope: సింహ రాశికి శుభవార్తలు.. తుల రాశికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 3, 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ రోజువారీ పనులు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్యంపై సూచనలు అందిస్తాయి. ప్రతి...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

Horoscope: వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. కుంభ రాశికి శుభవార్త

జులై 7, 2026 మంగళవారం రాశిఫలాలు: చంద్రమాన పంచాంగం ప్రకారం ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు....