Switch to English

పుండు మీద కారం చల్లినట్టుగా డబ్ల్యూహెచ్ఓ తీరు.!

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని పలు దేశాలు మండిపడుతున్నాయి. కుట్రో, పొరపాటో.. ఎలా చూసినా ఈ వైరస్ చైనా నుంచి వచ్చిందనేది నిస్సందేహం. అయితే, ఈ వైరస్ వెలుగు చూసిన తర్వాత ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ముందుగానే దీని గురించి ప్రపంచ దేశాలకు చెప్పి ఉంటే, ఇంత నష్టం జరిగి ఉండేదని కాదని పలు దేశాలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే చైనా పేరెత్తితే చాలు శివాలెత్తుతున్నారు. ఇది ముమ్మాటికీ చైనా సృష్టేనని మండిపడుతున్నారు.

ఈ విషయాన్ని చెప్పకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఘోరం తప్పిదం చేసిందని దుయ్యబట్టారు. డబ్బులు ఇచ్చేది తాము.. కానీ ఆ సంస్థ వంతపాడేది మాత్రం చైనాకు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు నిధులివ్వడాన్ని కూడా నిలుపుదల చేశారు. అమెరికా ఇంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ మాత్రం అందులో మరింత ఆజ్యం పోసేలా వ్యవహరించారు. ట్రంప్ కు చురకలు వేసేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని, సమాజం తిరిగి మామూలు స్థితికి ఎలా చేరిందో వూహాన్ ను చూసి నేర్చుకోవాలంటూ డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వ్యాఖ్యానించారు. ‘చైనా నుంచి ప్రపంచం చాలా నేర్చుకోవాలి.

ఆంక్షలు ఎలా ఎత్తివేయాలో, సమాజాన్ని తిరిగి సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలో వూహాన్ ను చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ కేసులు ఏమీ లేకపోవడం స్వాగతించతగ్గ పరిణామం’ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే చైనాపై ట్రంప్ ఆగ్రంతో రగలిపోతున్న తరుణంలో మరియా వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా మారాయి. డ్రాగన్ కంట్రీపై ప్రతికారం తప్పదని, ఆ దేశంపై అదనపు సంకాలు విధించడం తమ ముందున్న ఓ మార్గమని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తానికి ప్రపంచానికి ప్రతినిధి వ్యవహరించాల్సిన డబ్ల్యూహెచ్ఓ.. ఎన్ని విమర్శలు వస్తున్నా, చైనాకే వత్తాసు పలకడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

ఆ కుర్రాడు పాములా నెలకు ఒకసారి కుబుసాన్ని వదులుతూ ఉంటాడు

పాములు తమ చర్మ అమరిక అనుసారంగా కుబుసంను వదులుతూ ఉంటాయి. పాములు కుబుసం వదలడం చాలా కామన్‌ విషయం. కాని ఒక మనిషి పాము మాదిరిగా కుబుసం వదలడం ఎప్పుడైనా చూశారా. మనిషి...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

బిగ్‌ స్టోరీ: ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత తీసుకోగలరా.?

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అలాగే టీడీపీ మహానాడు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌...

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

మల్టీస్టారర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకీ

మల్టీస్టారర్లు ఈ మధ్య కాలంలో బాగానే వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకూ టాలీవుడ్ మర్చిపోయిన ఈ మల్టీస్టారర్ కాన్సెప్ట్ కు విక్టరీ వెంకటేష్ ఆజ్యం పోసాడనే చెప్పాలి. ఒక రకంగా సీతమ్మ వాకిట్లో...