Switch to English

కరోనాను అంతం చేయడం అంత వీజీ కాదు!

చిన్న, పెద్ద, ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరినీ కబళిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పటికి అంతమవుతుంది? ప్రపంచానికే పెనుసవాల్ గా మారిన ఈ వైరస్ అంతు చూడటం ఎలా? ప్రస్తుతం అందరి ముందున్న పెద్ద టాస్క్ ఇదే. కంటికి కనిపించని ఈ అతిపెద్ద శత్రువు మొత్తం ప్రపంచాన్నే తీవ్రంగా వణికిస్తోంది. శాస్త్రవేత్తలు ప్రయోగాలలో తలమునకలై ఉన్నా.. దీన్ని ఎదుర్కొనే మందు కనుక్కోలేకపోతున్నారు.

ఈ మాయల మహమ్మారి ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో దీనికి విరుగుడు కనుక్కోవడం శక్తికి మంచిన పనిగా మారింది. వేసవిలో దీని ప్రతాపం తగ్గుతుందని భావించినా.. అది కూడా జరగడంలేదు. ఈ నేపథ్యంలో కరోనా.. అసలు అంతమవుతుందా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తున్నాయి.

కరోనాకు మందు కనుక్కునే వరకు దానితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాల్సిందేనని సీఎంల దగ్గర నుంచి ప్రధాని వరకు పలువురు తేల్చి చెప్పేశారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా అదే మాట చెప్పింది. కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమి కొట్టడం సాధ్యం కాదని చేతులెత్తేసింది. కరోనాను నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం అధిపతి మైకేల్ ర్యాన్ స్పష్టంచేశారు.

చాలాదేశాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఇక ఈ వైరస్ తో కలిసి జీవించడం అలవాటు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్.. ప్రపంచం మొత్తం పాకడానికి కారణం డబ్ల్యూహెచ్ఓయే అని అమెరికా సహా పలు దేశాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

చైనాలో ఈ వైరస్ మొదలైన తొలినాళ్లలోనే దీనికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చి ఉంటే ప్రపంచం ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉండేది కాదని పలు దేశాలు డబ్ల్యూహెచ్ఓపై మండిపడుతున్నాయి. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించిందని తాజాగా సీఐఏ నివేదిక పేర్కొనడం సంచలనంగా మారింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...

బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో భారీ పవర్ ప్లాంట్ బ్లాస్ట్.!

గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీని వలన తాజాగా తెలంగాణ, నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి...

బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి...

బిగ్‌ స్టోరీ: ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత తీసుకోగలరా.?

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అలాగే టీడీపీ మహానాడు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌...

శానిటైజ్ చేసేప్పుడు ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇలానే పేలిపోద్ది.!

జాగ్రత్త సుమీ: వెహికల్ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిన ఈ కరోనా టైంలో బైక్ ఇంజిన్ ఆన్ లో ఉండగా శానిటైజ్ చేయించవద్దు. అలా చేస్తే ఇలానే మంటలు చెలరేగి ప్రాణాలు పోగొట్టుకునే...