జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కోసం నడుం బిగించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే, హిందువునైన తాను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇతర మతాల్ని గౌరవించడం.. అని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా, సనాతన ధర్మానికి కొందరు పెడార్థాలు తీస్తున్నారు.
ఈ క్రమంలో ‘సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను’ అంటూ శపథాలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కి వీరాభిమానులుగా మారిపోతున్నారు కొందరు. అదంతా, ఉదయ నిధి మీద అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ పైనా.. అలానే, సనాతన ధర్మంపైనా పెంచుకున్న ద్వేషమే.!
సినీ నటుడు ప్రకాష్ రాజ్ కావొచ్చు, కొందరు యూ ట్యూబ్ ఛానళ్ళ నిర్వాహకులు కావొచ్చు.. ఇలా ప్రత్యేకించి, అన్య మతస్తులైన కిరాయి మూకల్నే పెంచి పోషిస్తూ, పవన్ కళ్యాణ్ మీదకి అస్త్రాలుగా ప్రయోగిస్తున్నది ఎవరు.?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌పైనా, సనాతన ధర్మంపైనా జరుగుతున్న దుష్ప్రచారాన్ని పరిశీలిస్తే, తెరవెనుకాల కథ నడిపిస్తున్నది వైసీపీ అధినాయకత్వమేనన్న విషయం సుస్పష్టమవుతోంది.
వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ నిర్వహిస్తున్న స్పేసుల్లో, పైన చెప్పుకున్న కిరాయి మూకలకు అభినందనలు పోటెత్తుతున్నాయ్. ‘మీ వెనుక మేమున్నాం..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ భరోసా ఇస్తున్నాయి.
రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కొనే ధైర్యం లేక, గత కొన్నేళ్ళుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు మరింతగా బరితెగించి, ఏకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ‘మూకల్ని’ తయారు చేసి, పవన్ కళ్యాణ్‌పైకి సంధిస్తుండడం ముమ్మాటికీ అభ్యంతరకరమే.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, తమ అధినాయకత్వం ఆదేశాలతో కాకుండా, వ్యక్తిగతంగా ఇలా బరితెగిస్తారని అనుకోలేం.! వేలల్లో కాదు, లక్షల్లో ఈ మూకలకు చెల్లింపులు వైసీపీ అధినాయకత్వం నుంచి జరుగుతున్నాయన్నది కేవలం పుకార్లు మాత్రమేనా.? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు.?