Switch to English

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సరికొత్త సంచలనానికి తెరలేపారు గనుక.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. తెలంగాణలో కలకలం రేపుతున్న ఘటన ఇది. ఈ వ్యవహారం చుట్టూ రాజకీయ రచ్చ జరుగుతోంది. డ్రగ్స్ కేసులోంచి కొందర్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తప్పించిందన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. అలా తప్పించడానికి రాజకీయ కారణాలున్నాయంటే, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇరువురి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. అదిప్పుడు ‘వైట్ ఛాలెంజ్’ వరకూ తీసుకొచ్చింది.

తాను ఏ ఆసుప్రతికి వెళ్ళి అయినా డ్రగ్స్ విషయమై వైద్య పరీక్షలకు సిద్ధమనీ, మంత్రి కేటీయార్ అందుకు సిద్ధమా.? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీయార్ మాత్రమే కాదు, కేసీయార్ మీద కూడా తీవ్రస్థాయి దూషణలకు దిగుతున్నారు రేవంత్ రెడ్డి. అట్నుంచి కూడా అంతే స్థాయిలో దూషణల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది రేవంత్ రెడ్డికి.

కాగా, రేవంత్ విసిరిన సవాల్ విషయమై స్పందించిన కేటీయార్, తాను ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు సిద్ధమనీ, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా ఆ పరీక్షలకు సిద్ధమవుతారా.? అని కేటీయార్ ఎదురు ప్రశ్నించారు. విషయం ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకుంటున్నారు. అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి, వైట్ ఛాలెంజ్ అంటున్నారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేసీయార్ తదితరుల్ని రేవంత్ రెడ్డి నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ‘వైట్ ఛాలెంజ్’కి గ్రీన్ ఛాలెంజ్ తరహాలో రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి స్పందన వస్తుందా.? అన్నది చర్చనీయాంశమయ్యింది. అయితే, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి విసిరే వైట్ ఛాలెంజ్‌లో అర్థమేముందన్నది ఓ చర్చ.

అయినాగానీ, ఛాలెంజ్ అయితే ఆహ్వానించదగ్గదే. వైట్ ఛాలెంజ్.. డ్రగ్స్ లేని తెలంగాణ.. డ్రగ్స్ లేని భారతదేశం.. మంచి ఆలోచనే ఇది. కానీ, అందుకు అంగీకరించేదెవరు.? ఎవరు రాజకీయాల్లో సుద్దపూసలు.? సినీ పరిశ్రమలో సుద్దపూసలెంతమంది.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ రివ్యూ

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా ఈయనకు హిట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ...

కరోనాను జయించిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతూనే ఉంది. 2023 వరకు కరోనా భయంతో ప్రపంచం బిక్కు బిక్కుమనాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ మాత్రం తాము కరోనాను జయించినట్లుగా...

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాడతాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై  ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన...

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు విష్ణు వ్యాఖ్యలు..!!

ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన...

రాశి ఫలాలు: ఆదివారం 17 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా‌.5:37 తిథి: ఆశ్వీయుజ ద్వాదశి రా.6:26 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: శతభిషం ఉ.11:50 వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: వృద్ధి...