ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి అయ్యేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,468FansLike
57,764FollowersFollow

జనసేన ముఖ్య నేత కొణిదెల నాగబాబు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శాసన మండలి ఛైర్మన్ సమక్షంలో నేడు, నాగబాబు ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేశారు. అంటే, నేటి నుంచి ‘ఎమ్మెల్సీ’ నాగబాబు.. అనే అధికారిక గుర్తింపు (ప్రోటోకాల్) నాగబాబుకి దక్కిందన్నమాట.

తర్వాతేంటి.? ఇంకేముంది, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేస్తే, అప్పుడు నాగబాబు మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడమే. నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.

మామూలుగా అయితే, మంత్రి అవడానికి ముందుగా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వాల్సిన పని కూడా లేదు. మంత్రి అయిన తర్వాత, ఆరు నెలలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవ్వాల్సి వుంటుంది ఎవరైనా.

కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, ఎమ్మెల్సీ అయ్యాకనే నాగబాబుని మంత్రిగా చూడాలనుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు, ఎమ్మెల్సీ అయ్యేవరకు నాగబాబుకి మంత్రి పదవిని చంద్రబాబు వాయిదా వేశారు.

ఇదిలా వుంటే, ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేశాక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు నాగబాబు. సతీ సమేతంగా నాగబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవగా, నాగబాబుకి శాలువా కప్పి విషెస్ అందించారు చంద్రబాబు.

నాగబాబు విషయమై టీడీపీలో కొందరికి కొన్ని అభ్యంతరాలున్నమాట వాస్తవం. గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేశారనో, బాలయ్యను తూలనాడారనో.. తెలుగు తమ్ముళ్ళకి చిన్న కోపమైతే వుంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. టీడీపీ నుంచీ పవన్ కళ్యాణ్ మీద గతంలో విమర్శలు చూశాం. అది గతం.

ఇక, ఇక్కడితో ఆ వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయనే అనుకోవాలి.

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. అయితే.. కొందరు తన పేరు వాడుకుని...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

“మోదీ-నారా కుటుంబ ఆత్మీయ భేటీ.. గంటసేపు సాగిన ప్రత్యేక సంభాషణలు”

భారత ప్రధానమంత్రి Narendra Modi హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నివాసానికి స్వయంగా వెళ్లి గంటకు పైగా గడపడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది....