సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు సర్కారు వారి పాట సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు మహేష్ బాబు ఓకే చెప్పి దాదాపుగా రెండేళ్లు కావస్తుంది. కరోనా వల్ల మొత్తం పరిస్థితి అంతా కూడా గందరగోళం గా మారింది అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనుకున్న త్రివిక్రమ్ ఆ వెంటనే మహేష్ బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమా కు సర్కారు వారి పాట అడ్డం వచ్చింది. ఆ సినిమా విడుదల అయిన వెంటనే అమెరికా కు మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లాడు. అక్కడ నుండి మహేష్ బాబు ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా ప్రారంభించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ను మహేష్ కు ఇవ్వాల్సి ఉందట. అందుకే మహేష్ వచ్చేది ఎప్పుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.