ఒకప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అంటే.. ఇక అంతే సంగతులు.! కానీ, ఇప్పుడు అది కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ అయి కూర్చుంది. సీబీఐ ఎప్పుడో పంజరంలో చిలక.. అన్న ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో, ఈడీ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది.
‘ఈడీ’ విచారణ అంటే, దాన్నొక పబ్లిసిటీ స్టంట్‌గా రాజకీయ పార్టీలు మార్చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ‘ఈడీ’ విచారణ ఎదుర్కొన్నారు. ఆమె అరెస్టు ఖాయమన్న ప్రచారం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.
విచారణ సుదీర్ఘంగా సాగినా, కవిత అరెస్టు అయితే జరగలేదు. విచారణ అనంతరం కవిత హైద్రాబాద్‌కి తిరిగొచ్చేశారు.. తన తండ్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విచారణ వ్యవహారాలపై కేసీయార్‌కి కవిత పూర్తి వివరాలు అందించడం మామూలే.
వాట్ నెక్స్ట్.? ఔను కదా, తర్వాతేంటి.? ఇంకోసారి ఈడీ పిలుస్తుందా.? ఈలోగా కవిత చుట్టూ జరిగే రాజకీయమేంటి.? ‘మేమంతా మీతోనే వున్నాం కవితక్కా..’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కవిత పేరుని మార్మోగేలా చేస్తున్నాయ్. రాజకీయాల్లో ఇదొక సాధారణ ప్రక్రియ అయిపోయింది.
అక్కడికేదో దేశాన్ని ఉద్ధరించేసి, ఈడీ విచారణ ఎదుర్కొన్నట్టుంది పరిస్థితి. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి పలువురు కీలక రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ కోవలోనే తెలంగాణ నుంచి కవిత అరెస్టవుతారనే ప్రచారమూ తెరపైకొచ్చింది.
చిత్రంగా, ఏపీలో కొందరు నేతలపై ఆరోపణలు వచ్చినా, అక్కడ ఇంత హంగామా లేకుండా పోయింది.
924129 582278Spot on with this write-up, I actually suppose this web site needs significantly much more consideration. probably be once far more to learn way far more, thanks for that info. 19859
748975 5679I truly like your writing style, fantastic information, thankyou for posting : D. 911338
472742 998552whoah this weblog is magnificent i really like reading your posts. Keep up the wonderful work! You know, lots of people are looking about for this information, you can help them greatly. 968153
899592 18683Hello! Excellent stuff, please keep us posted when you post once again something like that! 886022
121876 444391Paper rolls quite excellent read you know alot about this subject i see! 999041