Switch to English

‘ఆకాశవాణి’లో అసలు ఏం జరిగింది?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన అద్బుత చిత్రం బాహుబలి రెండు పార్ట్‌ ల్లో కూడా ఆయన కుమారుడు కార్తికేయ కీలక పాత్ర పోషించారు. ప్రొడక్షన్‌ బాయ్‌ నుండి కో డైరెక్టర్‌ వరకు అన్ని పనులు తానై చూసుకునేవాడని రాజమౌళి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. దర్శకత్వంపై కంటే తనకు నిర్మాణంపై ఎక్కువ ఆసక్తి అంటూ గతంలో చెప్పిన కార్తికేయ అన్నట్లుగానే కొన్నాళ్ల క్రితం ఆకాశవాణి అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి చిత్రం దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయ్యింది.

ఆ సమయంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. విలక్షణమైన కథతో పాటు కార్తికేయ ప్రొడ్యూసర్‌ అవ్వడంతో సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. అయితే సినిమా ఎంతకూ రాకపోవడంతో రకరకాలుగా కామెంట్స్‌ వచ్చాయి. స్క్రిప్ట్‌ విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో సినిమాను ఆపేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా కార్తికేయ ఆకాశవాణి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

ప్రస్తుతం తాను ఇతర సినిమాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న కారణంగా ఆకాశవాణి సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అంతకు మించి విభేదాలు ఏమీ లేవన్నట్లుగా చెప్పాడు. కాని ఇండస్ట్రీలో మాత్రం అనేక రకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర యూనిట్‌ సభ్యులతో విభేదాల కారణంగానే ఆయన ఆకాశవాణి చిత్రం నుండి తప్పుకున్నాడని అంటున్నారు.
కార్తికేయ తప్పుకోవడంతో మళ్లీ ఆకాశవాణి చిత్రం షూటింగ్‌ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. వచ్చే ఏడాదిలో ఆకాశవాణి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్తికేయ తప్పుకునేంత ఆకాశవాణిలో ఏం జరిగి ఉంటుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
‘ఆకాశవాణి’లో అసలు ఏం జరిగింది? ‘ఆకాశవాణి’లో అసలు ఏం జరిగింది?

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...

క్రైమ్ న్యూస్: కూతురు ప్రేమలో పడినందుకు శిక్షగా రేప్‌ చేసిన తండ్రి.. తల్లి సహకారం

నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్‌లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల...

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...

ఫ్లాష్ న్యూస్: దూమ్ ధామ్ గా నిశ్చితార్థం.. 250 ఫ్యామిలీల దూల తీర్చేసిన కరోనా.!

లాక్‌డౌన్‌లో చావుకు పది మంది, పెళ్లికి 20 మంది అంటూ ప్రభుత్వాలు కండీషన్‌ పెట్టాయి. ఇప్పటికి కూడా అదే కండీషన్‌ అమలులో ఉంది. కాని కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు....