Switch to English

ఈ ఛాలెంజ్ లతో ఒరిగేదేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ఛాలెంజ్ ల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ఏదైనా విభిన్నంగా ఉండే ఓ పనిని చేసి, అలా చేయాలని ఇతరులకు ఛాలెంజ్ విసరడం ఇందులో చూస్తుంటాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి ప్రస్తుతం హవా సాగుతున్న బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ వరకు ఎన్నో చూశాం. అయితే, వీటిలో చాలా ఛాలెంజ్ ల వల్ల ఒరిగేదేమిటంటే సమాధానం ఉండదు. ఏదో సరదాకి తప్ప.. వీటితో సమాజానికి లేదా వ్యక్తులకు కలిగే లాభం ఏమీ ఉండదనేది సత్యం.

ఐస్ బకెట్ ఛాలెంజ్ గుర్తుందా? ఒకప్పుడు సోషల్ మీడియాలో దీని హవా బాగా నడించింది. ఓ వ్యక్తి బకెట్ నిండా ఉన్న ఐస్ ముక్కలను తలపై నుంచి పోసుకోవడమే ఇందులోని ఓ టాస్క్. ఈ పని చేసిన వ్యక్తి కొంతమందికి ఈ సవాల్ విసురుతాడు. 24 గంటల్లోగా ఈ ఛాలెంజ్ పూర్తిచేసి మరికొంతమందికి అతడు దీనిని నామినేట్ చేయాలి. ఎవరైనా టాస్క్ పూర్తి చేయలేకపోతే ఛారిటీ సంస్థలకు విరాళమివ్వాలి. ఇది కొంతవరకు బాగానే ఉంది.

అయితే, దీనిని స్ఫూర్తిగా తీసుకుని మనదేశంలో రైస్ బకెట్ ఛాలెంజ్ తీసుకొచ్చారు. ఇందులో ఒక బకెట్ బియ్యాన్ని పేదలకు పంచాల్సి ఉంటుంది. ఇది కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇందులో పలువురు పేదలకు లబ్ధి చేకూరింది. ఒకవిధంగా చెప్పాంటే ఇలాంటి ఛాలెంజ్ లు సమాజానికి కాస్త మేలు చేస్తాయి.

కానీ ప్రస్తుతం వైరల్ గా మారిన బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ వల్ల మాత్రం ఒరిగిదేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన ఇంటి పని చేసుకోవడం లేదా కాఫీ పెట్టి ఇవ్వడం వంటి పనుల వల్ల సాధారణ ప్రజలకు కలిగే లాభం ఏమిటని పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇలా కాకుండా ప్రస్తుత కరోనా కష్ట కాలంలో పేదలు, అభాగ్యులకు చేయూతనిచ్చే పనులు ఏవైనా చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఛాలెంజ్ లు విసరడం ద్వారా అసలైన హీరో అనిపించుకోవచ్చని చెబుతున్నారు.

అంతేకాకుండా సంక్షోభంలో చిక్కుకున్న సినీ పరిశ్రమ ఎప్పటికి బయట పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిశ్రమను ఆదుకునే విధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. హీరోలైతే తమ పారితోషికం తగ్గించుకోవడం, సాధ్యమైనంతగా సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గించే చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమ కోలుకునేటట్టు చేయొచ్చని చెబుతున్నారు. ఇలాంటి రియల్ చాలెంజ్ లు అనిపించుకుంటాయని స్పష్టంచేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో కాస్త ముందడుగు వేశారని చెప్పొచ్చు. సినిమా విడుదల అయ్యే వరకు హీరోలు పారితోషికం తీసుకోకుండా ఉంటే నిర్మాతలకు వడ్డీ రూపేణా బోలెడు ఆదా చేసినవారమవుతామని పేర్కొన్నారు. నిజంగా ఇది మంచి నిర్ణయమే. దీంతోపాటు సినిమా వ్యయం తగ్గించే చర్యలు కూడా చేపడితే పరిశ్రమ నాలుగు కాలాలపాటు చక్కగా ఉంటుందనేది పలువురి మాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...