Switch to English

వాట్‌ నెక్స్‌ట్‌.. లాక్‌డౌన్‌ ఎత్తేస్తారా.? కొనసాగిస్తారా.?

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్‌డౌన్‌ పరిస్థితి నుంచి ఉపశమనం దొరుకుతుందా.? లాక్‌డౌన్‌పై పొడిగింపు వైపే ప్రధాని నరేంద్రమోడీ మొగ్గు చూపుతారా.? ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అని గతంలో చెప్పిన నరేంద్ర మోడీ, ఇప్పుడేమో, ‘ప్రాణంతోపాటు.. జీవనం కూడా అవసరమే..’ అని అంటున్నారు. దానర్థం, లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వుంటాయనే.! రేపు ఉదయం 10 గంటలకు ఈ అంశంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది.

రేపటితో 21 రోజుల లాక్‌డౌన్‌ ముగియనున్న దరిమిలా, ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ని ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ తదితర కొన్ని రాష్ట్రాలు మాత్రం, ‘జోన్ల వారీగా’ నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాయి. కేసుల తీవ్రత అధికంగా వున్న చోట లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ, మోస్తరు తీవ్రత వున్న ఆరెంజ్‌ జోన్లలో కొంత వెసులుబాటు కల్పించి, అస్సలేమాత్రం కరోనా ప్రభావం లేని గ్రీన్‌ జోన్లలో ఇంకాస్త ఎక్కువ వెసులుబాటు కల్పించాలన్నది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీకి చేసిన విజ్ఞప్తి తాలూకు సారాంశం.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత.. కేంద్రంలో ఆయా అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరిగింది. దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్న స్థితికి దిగజారిపోయిన దరిమిలా, లాక్‌డౌన్‌ ‘సడలింపు’పై సానకూల నిర్ణయమే కేంద్రం నుంచి రావొచ్చన్న చర్చ జరుగుతోంది. కానీ, అలా చేస్తే.. కరోనా వైరస్‌ తీవ్రత మళ్ళీ మొదటికే వచ్చే ప్రమాదముంది. ఏమో, మోడీ మనసులో ఏముందో.. రేపు ఉదయం 10 గంటలకల్లా తేలిపోతుంది. అప్పటిదాకా సస్పెన్స్‌ తప్పదంతే.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

సినిమా జోనర్ చెప్పండి …సర్ప్రైజ్ గిఫ్ట్స్ గెలుచుకోండి.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమా ‘వ్యాక్సీన్ వస్తుంది’ (వర్కింగ్ టైటిల్). కరోనా వైరస్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర సినిమా ప్రీలుక్, మోషన్ పోస్టర్ శుక్రవారం తన...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

భారత్ – ఆస్ట్రేలియా బంధాన్ని బలోపేతం చేస్తున్న ‘సమోసా’

ఒక సమోసా రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమోసా.. ఏంటి దేశాల మధ్య స్నేహం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజమే. భారతీయ చిరుతిండి (స్నాక్) సమోసా ఆస్ట్రేలియా ప్రధానిని...

ప్రేమ పెళ్లి పేరుతో కోటి లాగేసిన కి‘లేడీ’

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్‌ లైన్‌లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి...

ప్రేయసి కోసం ప్రియుడు.. అమ్మాయి వేషంలో వెళ్లి..

‘దేశంలో లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి.. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోయాయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కార్మికులు పనుల్లేక అవస్థలు పడ్డారు..’ ఇవే మనం చూశాం. కానీ.. లాక్ డౌన్ వల్ల ప్రేమికులు...