ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అదేంటి దేవర సినిమా మంచి హిట్ అయింది కదా.. ఇంకెందుకు టెన్షన్.. పైగా రాబోయేవి పెద్ద సినిమాలే ఉన్నాయి అనుకుంటున్నారా.. కానీ వార్ -2 సినిమా విషయంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడంటూ అటు బాలీవుడ్ మీడియా, ఇటు తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో సెకండ్ హీరో పాత్ర చేశాడు అనే ప్రచారాన్ని కూడా ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు.
దీనిపై రాజమౌళిని ఏకి పారేశారు. దెబ్బకు మూవీ టీమ్ కూడా స్పందించి.. ఎన్టీఆర్ ది సెకండ్ హీరో పాత్ర కాదని ఆయన పాత్ర సినిమాకే హైలెట్ అంటూ వివరణ ఇచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు వార్-2లో విలన్ పాత్ర అంటే ఇంకేమైనా ఉందా.. ఎన్టీఆర్ ను మిగతా హీరోల ఫ్యాన్స్ ఇప్పుడే తక్కువ చేస్తూ పోస్టులు పెడుతున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. హృతిక్ రోషన్ హీరో అయితే విలన్ పాత్ర ఎన్టీఆర్ ది అంటూ చెప్పడాన్ని ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు ఆయన అభిమానులు. కాబట్టి ఈ విషయంపై అర్జెంటుగా క్లారిటీ కావాలంటున్నారు.
ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇవ్వాలని లేదంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. ఫ్యాన్స్ ఆవేదనను ఎన్టీఆర్ పట్టించుకుని ఏదైనా ఒక హింట్ ఇస్తాడేమో వేచి చూడాలి.