వికేంద్రీకరణ చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి.? ఆ వికేంద్రీకరణకు అధికార పార్టీ చెబుతున్న చిత్రమైన అర్థమేంటి.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ.. అని రెండున్నాయి ఈ వికేంద్రీకరణ విషయంలో. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరైనా ‘తప్పు’ అనగలరా.? చాన్సే లేదు.
పరిపాలన వికేంద్రీకరణ దగ్గరే వస్తోంది అసలు సమస్య. వికేంద్రీకరణకు వింత అర్థాన్నిస్తూ, పరిపాలన వికేంద్రీకరణ.. అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పరిపాలన వికేంద్రీకరణనూ కొంతమేర తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే, మొండిగా.. అదే సర్వరోగ నివారిణి.. అనడమే అసలు తప్పు.
శాసన వ్యవస్థ అమరావతిలో వుండాలి.. వీలైతే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం.. అంటూ ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. అసలంటూ శాసనసభని ప్రతిపక్షం బహిష్కరించడమనే ట్రెండ్ మొదలయ్యాక.. చట్ట సభల నిర్వహణ అధికారంలో వున్న పార్టీల కార్యాయాల్లో నిర్వహిస్తే పోలా.? అన్న ఆవేదన జనంలో వుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, కార్యనిర్వాహక రాజధాని.. అదేనండీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటాడో మహానుభావుడు. ఇకనేం, ఐదారు కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలతో ఓ బస్సుని రూపొందిస్తే, దాంట్లో ముఖ్యమంత్రి తనకి నచ్చినప్పుడు నచ్చిన చోటకి వెళ్ళి ఆ బస్సులోంచే (అప్పట్లో చంద్రబాబు కొన్నాళ్ళు విజయవాడలో.. ఇలాగే చేశారట) పరిపాలించేస్తే.. రాష్ట్రమంతా రాజధానే అవుతుంది కదా.?
న్యాయ రాజధాని గురించి మాట్లాడుకుందాం. అమరావతిలో హైకోర్టు పెట్టి, అవసరమైతే బెంచ్‌లను విశాఖలోనూ, కర్నూలులోనూ పెట్టుకోవచ్చు. దాన్నీ ఎవరూ తప్పుపట్టరు.
నిజానికి, జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ. విశాఖ నగరం ఎలా అభివృద్ధి చెందిందో, శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. తిరుపతి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు.. ఇలా రాష్ట్రంలో ప్రధాన పట్టణాలన్నీ ఒకే స్థాయిలో అభివృద్ధి చెందాలి. గ్రామాలకూ ఆ అభివృద్ధి ఫలాలు అందాలి. పారిశ్రామికీకరణ దగ్గర్నుంచి.. అన్ని విషయాల్లోనూ అన్ని జిల్లాలకూ సమప్రాధాన్యత లభించాలి.
ఇవన్నీ వదిలేసి, రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడదీసి, నీకొక రాజధాని.. నీకు ఇంకో రాజధాని.. నీకు మరో రాజధాని.. అని మూడు ముక్కల ప్లాన్ చేస్తే, దాన్ని విభజనవాదం అంటారు తప్ప, వికేంద్రీకరణ అనరు.
908920 125554Hello! I just would like to give a huge thumbs up for the excellent info youve here on this post. I may possibly be coming back to your weblog for more soon. 931010
35294 83268Often the Are normally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction strategy product modeled on individuals seeking out shed some pounds combined with at some point preserve a far healthier your life. la weight loss 900245
226231 83606obviously like your web-site but you have to check the spelling on quite a few of your posts. 623744