సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత అక్కడే మరో వెబ్ సీరీస్ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఖుషి సినిమా తర్వాత మరో సినిమా సైన్ చేయని అమ్మడు తన ట్రాలాలా ప్రొడక్షన్ లో మాత్రం శుభం అనే సినిమాతో రాబోతుంది.
సమంత సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా అప్డేట్స్ తో ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా అమ్మడు తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ వాటి గురించి ఒక్కో ఫోటో దేనికి అన్నది కామెంట్స్ రాసుకొచ్చింది. ఐతే సమంత్ షేర్ చేసిన ఫోటోల్లో ఒకటి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది.
దానికి ఆమె రికవరీ అంటూ వెల్ నెస్ కోసం అన్నట్టుగా రాసుకొచ్చింది. సమంత సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్ అంతా మళ్లీ సమంతకు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. మొన్నటిదాకా మయోసైటిస్ వల్ల బాధపడ్డ సమంత పూర్తిగా కోలుకున్నట్టే కనిపిస్తున్నా అప్పుడప్పుడు వెల్ నెస్ కోసం ఇలా చేస్తుందని తెలుస్తుంది. ఫిట్ గా ఉండేందుకు ఎప్పటికప్పుడు తను చేసే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది సమంత. అందులో భాగంగానే సమంత సెలైన్ ఎక్కించుకున్న ఫోటో కూడా కంగారు పడాల్సింది ఏమి లేదు ఆమె రెగ్యులర్ చెకప్ లో భాగంగానే అలా చేసిందని అర్ధమవుతుంది.