పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,684FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా, రాజకీయాల్లోకి వచ్చాక, ఆ సమస్య తీవ్రమైంది.

క్షణం తీరిక లేని పొలిటికల్ షెడ్యూల్స్ నేపథ్యంలో, సర్జరీని వాయిదా వేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ, ఇటీవల సమస్య మరింత తీవ్రమవడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదు. పవన్ కళ్యాణ్‌కి జరిగిన సర్జరీ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ, అదే రోజు ఫోన్‌లో పరామర్శించారు.

తాజాగా, హైద్రాబాద్ పర్యటన సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆరోగ్యంపై తగు జాగ్రత్తలూ సూచించారు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌కి. పెద్దన్న లాంటి నరేంద్ర మోడీ, తన ఇంటికి రావడం పట్ల పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.

అయితే, పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని వెళ్ళబోతున్నారన్న ప్రచారం నాలుగైదు రోజులుగా జరుగుతున్న దరిమిలా, ఈ విషయమ్మీదా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్ళడంలేదనీ తేల్చారు.

కానీ, పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ వెళ్ళారు, పలు అంశాలపై పవన్ కళ్యాణ్‌తో చర్చారు. కుటుంబ సభ్యుల్ని పేరు పేరునా పలకరించి, వారితో ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోడీ రాజకీయ అంశాలపైనా చర్చించారనే ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్‌ని పొలిటికల్ పవర్ స్టార్ అనీ, ఆంధీ అనీ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బీజేపీ – జనసేన బంధం మరింత బలపడాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్నారు. ఇదే విషయమై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

వేగంగా కోలుకుని, రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవ్వాలని పవన్ కళ్యాణ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు తెలుస్తోంది. ‘కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమవ్వొద్దు..’ అని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌కి స్పష్టంగా చెప్పారట.

పూర్తిగా కోలుకున్నాక, ఢిల్లీకి వస్తే.. మరింత లోతైన చర్చ ఈ విషయమై జరపాల్సి వుందని పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని తెలుస్తోంది. వచ్చే నెలలో, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళే అవకాశం వుంది.

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

‘పెద్ది’కి భారీ వసూళ్లు.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లాభాలు నమోదు కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...

”వంద ఇస్తామని పిలిచారు.. వచ్చాం”: చావుల వద్ద కూడా తరలింపా?!

రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. వంద నుంచి రెండు వేల రూపాయల దాకా ఒక్కో మనిషి మీదా ఖర్చు చేస్తే తప్ప, రాజకీయాలు చేయలేని దుస్థితి. ఇంకెవరూ రాజకీయం చేయడం లేదా.? వైఎస్ జగన్...

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! OG-2 అప్డేట్ వచ్చేసింది

Pawan Kalyan: గతేడాది విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య 2025 సెప్టెంబర్ 25న విడుదలైన సినిమా భారీ వసూళ్లు...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ పోటు.! ఇదేం ‘చావు’ రాజకీయం.!

‘మావిగన్’ అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతిష్టమో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. తాజా ప్రెస్ మీట్‌లో కూడా వైఎస్ జగన్, ‘మావిగన్’ అంటూ, ఊక దంపుడు ప్రసంగం చేసేశారు. ఆ ‘మావిగన్’...