Switch to English

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం’’ – ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పే విషయం.

అమ్మ ఒడి ప్రారంభించినప్పుడూ, రైతుభరోసా డబ్బులు వేసినప్పుడు కూడా లబ్ధిదారుల ఎంపిక గురించి ఆయన ఇదే సంగతి చెప్పారు. తాజాగా రాష్ట్రంలో అర్హులైన వ్యక్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సాగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల జోక్యం పెరుగుతోంది. తమకు కావాల్సినవారికే ఇళ్ల స్థలాలు వచ్చేలా చేసేందుకు పలువురు స్థానిక నేతలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నయానో భయానో వాలంటీర్లను తమ దారికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. అలా కుదరనిచోట్ల వాలంటీర్ల సంతకాలు పోర్జరీ కూడా చేయడం చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వాలంటీర్లు తమ సంతకాలు ఫోర్జరీ చేసి లబ్ధిదారుల జాబితా మార్చేశారని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశం జిల్లా కోడిగుడ్లపాడులో ఓ వాలంటీర్ 60 మందితో కూడి లబ్ధిదారుల జాబితాను అధికారులకు అందజేయగా.. అనంతరం అది పూర్తిగా మారిపోయిందని సదరు వాలంటీర్ గుర్తించాడు. 22 మంది పేర్లతో కూడిన జాబితాను రూపొందించి దానిపై అతడి సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుసుకుని అవాక్కయ్యాడు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నిర్వహిస్తున్న మేధోమథనంలో జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లపై ప్రశంసలు కురిపించారు. అవినీతి అనేదే అంటని వ్యవస్థ అని కొనియాడారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆ వ్యవస్థలో స్థానిక నేతల జోక్యం కూడా లేనప్పుడే జగన్ చెబుతున్నవన్నీ నిఖార్సుగా జరుగుతాయి.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా...

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభన మామూలుగా లేదు. మొన్నటి వరకు సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు వైరస్‌ దూరంగా ఉందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారికి కూడా పాజిటివ్‌ నిర్థారణ అవుతోంది. ఏపీలో ఇప్పటికే...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

ఎక్కువ చదివినవి

ఆ అమాత్య పదవులు అందేదెవరికో?

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ ఎమ్మెల్సీ పదవులతోపాటు మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయడంతో కేబినెట్ లో...

కరోనా విలయం.. జూలై 31వరకూ లాక్ డౌన్

మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31వరకూ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్...

ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఎందుకు చంపాడంటే..

మేడ్చల్ జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. చిన్నారి తల్లి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం చిన్నారిని హత్య చేసిన వ్యక్తి...

కరోనాతో చనిపోయిన భర్త మృతదేహం మిస్సింగ్.. వృద్ధురాలి ఆవేదన.. చివరకు..

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ మృతుడి మిస్సింగ్ సంచలనం రేపింది. కరోనాతో వసంతరావు అనే వృద్ధుడు జూన్ 25న కరోనాతో మృతి చెందినా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. మృతదేహాన్ని వారం రోజులుగా మార్చురీలోనే...

8 మంది పోలీసులు చనిపోతే ఎవ్వరికీ నోరు పెగలదేం.!

తమిళనాడులో ఘోరం జరిగింది. ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత దారుణంగా హింసించారు. ఈ క్రమంలో ఆ తండ్రీ కొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తండ్రి వయసు యాభయ్యేళ్ళకు పైనే. తనయుడి వయసేమో...