ఇండియాలో పెళ్లిళ్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకునే సమయంలో మన కల్చర్, హుందాతనం ఉట్టిపడేలా ఖర్చులు చేస్తారు. అందుకే మధ్యతరగతి వారి దగ్గరి నుంచి ధనవంతుల దాకా పెళ్లి కోసం చాలానే ఖర్చు చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్లు కూడా లక్షల్లోనే ఖర్చు పెడుతుంటారు. అయితే గడిచిన ఆరు నెలల దాకా పెళ్లిళ్లు పెద్దగా జరగలేదు. అప్పుడు సీజన్ లేదు. కానీ ఇప్పుడు రాబోయే రెండు నెలలు మాత్రం పూర్తిగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 48 లక్షల పెళ్లిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పెళ్లిళ్ల వల్ల ఏకంగా రూ.6లక్షల కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. పెళ్లి చుట్టూ జరిగే కార్యక్రమాల రూపంలోనే ఈ మొత్తం బిజినెస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కేటరింగ్, డిజైనింగ్, బట్టలు, తిండి, బంగారం, వైద్య ఖర్చులు, టెంట్ హౌజ్, లైటింగ్, వాటర్, కళ్యాణ మండపాలు.. ఇలాంటి బిజినెస్ లుఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఈ పెళ్లిళ్ల సీజన్ ఈ ఏడాదిలో చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగలేదు. ఇది ఒక రకంగా ఇండియా ఆర్థిక స్థాయిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఈ పెళ్లిళ్ల సీజన్ వల్ల చాలా మందికి ఉపాధి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీపావళి నుంచే ఈ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నవంబర్ నెల నుంచి పీక్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంది.