Chiranjeevi: సృష్టిలో భార్యాభర్తల బంధం ఎంతో ముఖ్యమైనది. వేర్వేరు కటుంబాల్లో పుట్టి, పెరిగి దాంపత్యంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభించే అద్భుతమైన క్షణాలవి. భార్యాభర్తల దాంపత్యానికి ఆదర్శంగా నిలిచిన జంటలెన్నో ఈ భువిపై. వారిలో ఒకరు కొణిదెల చిరంజీవి (Chiranjeevi).. అల్లు సురేఖ (Surekha). ఒకరు తెలుగు చిత్ర పరిశ్రమలో మేటి నటుడి కుమార్తె.. మరొకరు ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించి అదే తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన నటుడు. ఫిబ్రవరి 20’ 1981న మొదలైన వీరి జంట ప్రయాణం నేటితో 43ఏళ్లు పూర్తి చేసుకుని.. 44వ వసంతంలోకి అడుగిడుతోంది.
చిరంజీవిగారి జైత్రయాత్రలో..
నటుడిగా.. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలడం చిన్న విషయం కాదు. నిత్యం షూటింగ్స్, కథలు వినడం, పర్యటనలు, తీరకలేని షెడ్యూల్స్ తో కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా కష్టం. భర్త కష్టాన్ని అర్ధం చేసుకున్న అర్ధాంగిగా శ్రీమతి సురేఖ ఇంటి బాధ్యతల్ని అంతే నిబద్ధతో నిర్వర్తించారు. ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎక్కడా చిరంజీవికి వృత్తిగతమైన అడ్డంకులు లేవంటే కారణం సురేఖగారి ఉన్నత మనస్తత్వం. భార్యను అర్ధం చేసుకున్న మంచి మనసు చిరంజీవిగారిది. అందుకే తెలుగు సినిమాపై అప్రతిహత జైత్రయాత్ర చేశారు చిరంజీవి.
ఆదర్శ దాంపత్యం..
ఇందుకు కారణం వారి అన్యోన్య దాంపత్యం. ఒకరికొకరు అర్ధం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లారు. భార్యాభర్తలుగా ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ఎందరో ఔత్సాహికులు సినిమాల్లోకి రావడానికి ఆదర్శం. ఇదేవిధంగా చిరంజీవి-సురేఖ ఒకరి మనసు మరొకరు తెలుసుకుని గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుని ముచ్చటైన దంపతులుగా కూడా ఎందరికో ఆదర్శం. మరో వసంతంలోకి అడుగిడిన శ్రీ చిరంజీవి-శ్రీమతి సురేఖ గారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. టీమ్ ‘తెలుగు బులెటిన్’.