ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌ లో 49 కేజీల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకంను గెలుచుకుంది.

మీరాబాయి చాను స్నాచ్ లో 87 కేజీల క్లీన్‌ అండ్ జర్క్‌ లో 115 కేజీలు మొత్తం 202 కిలోల వెయిట్‌ ను లిఫ్ట్‌ చేసి రజతంను గెలుచుకుంది

2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌ లో కరణం మల్లేశ్వరి తర్వాత ఇప్పటి వరకు వెయిట్‌ లిఫ్టింగ్ లో భారత్‌ కు పథకం రాలేదు. ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ లో నేడు మీరాబాయి రజతంను సాధించింది.

మీరాబాయి మొదటి ప్రయత్నంలో 84 కేజీల వెయిట్‌ ను సునాయాసంగా లిఫ్ట్‌ చేసింది. ఆ తర్వాత ఈజీగానే 87 కేజీల వెయిట్‌ ను లిఫ్ట్‌ చేయగలిగింది. కాని 89 కేజీల వెయిట్ ను ఆమె లిఫ్ట్‌ చేయలేక పోయింది.

మీరాబాయి కామన్‌ వెల్త్‌ లో పలు పథకాలను గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా బహూకరించింది

2017 లో అమెరికాలో జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్‌ మెడల్ ను గెలుచుకుంది.