‘SR కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ

సెకండ్‌ వేవ్ తర్వాత ధైర్యం చేసి వస్తున్న మరో యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. పాటలకు మంచి స్పందన రావడంతో పాటు ట్రైలర్ మరియు టీజర్ పోస్టర్ లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. 

ధర్మ(సాయి కుమార్‌) ఆస్తులను అన్నింటిన పోగొట్టి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తాడు. గ్రామంలో ధర్మ కుటుంబంను అంతా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ధర్మ తనయుడు కళ్యాణ్‌ (కిరణ్‌) కాలేజ్ కు వెళ్తూ స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. తండ్రి కొడుకులకు ఎప్పుడు పడదు. ఇద్దరి మద్య సమస్య ఏంటీ.. 

కథ :

తెర మీద స్టార్స్‌…

రాజా వారు రాణి గారు సినిమాలో పక్కింటి అబ్బాయి తరహాలో కనిపించిన కిరణ్‌ ఈ సినిమాలో మాత్రం మాస్‌ ఎలిమెంట్స్‌ తో నిండిన పాత్రను చేశాడు. యాక్టింగ్‌ పరంగా మంచి ప్రతిభను కనబర్చాడు. కాని మాస్ ఎలిమెంట్స్‌ ను పాత్రలో చూపించే విధానం మాత్రం ఆకట్టుకోలేదు.

ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం ఓపెనింగ్‌ కాస్త పర్వాలేదు. కామెడీ సన్నివేశాలతో పాటు హీరో పాత్రను నడిపించిన తీరు బాగానే ఉంది. కాని సెకండ్‌ హాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకుండా పోయింది. 

విశ్లేషణ:

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5