సినిమా రివ్యూ: తిమ్మరుసు

ఎట్టకేలకు ఓపెన్‌ అయిన థియేటర్లకు కరోనా భయం లేకుండా జనాలు వెళ్లాలి అంటే సినిమాలు బాగుండాలి. సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదట విడుదల అయిన సినిమాల్లో తిమ్మరుసు ఒక్కటి. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం రండీ.

లాయర్‌ రామచంద్ర (సత్యదేవ్‌) ఒక హత్య కేసు విషయంలో ప్రత్యేక శ్రద్దతో దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించే కథనే తిమ్మరుసు. ఒక సామాన్య యువకుడికి శిక్ష పడకుండా రామచంద్ర ఎలా చేశారు.. ఆ హత్య కేసుకు సంబంధించిన విషయాలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.

కథ :

తెర మీద స్టార్స్‌…

నటుడిగా సత్యదేవ్‌ తన ప్రతి సినిమాలో కూడా నిరూపించుకుంటున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో ఆకట్టుకున్న సత్యేదేవ్‌ మళ్లీ అంతటి నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం కూడా తన భుజస్కందాలపై వేసుకుని మోసినట్లుగా అనిపించింది.

తిమ్మరుసు ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీ. సత్యదేవ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో పాటు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.ఫస్ట్‌ హాఫ్‌ లో నిరాశ పర్చినా.. కొన్ని పాత్రల విషయంలో సంతృప్తిపర్చలేక పోయినా కూడా మొత్తంగా తిమ్మరుసు పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు.

విశ్లేషణ:

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5