మెగా స్టార్ బర్త్ డే స్పెషల్స్ : ‘ప్రాణం ఖరీదు’తో తెలుగు సినిమాకు తన విలువెంతో చెప్పిన చిరంజీవి

తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం  ప్రారంభమైన ఆయన ప్రస్థానం అటు పాత తరం సినిమాకు.. నేటి తరం సినిమాకు వారధిగా నిలుస్తోంది. మెగాస్టార్ గా ఆయన దక్కించుకున్న కీర్తి, ప్రేక్షకుల నీరాజనాలు, అభిమానుల కేరింతలు అంత తేలిగ్గా దక్కలేదు. నటుడిగా తెలుగు తెరకు పరిచయమై ఇప్పటికి 152 సినిమాల్లో నటించి.. మెప్పించారు. ఆయన సినీ ప్రస్థానం తొలి సినిమా ‘పునాదిరాళ్లు’తో మొదలైంది. అయితే.. మొదటగా  విడుదలైన సినిమా మాత్రం ‘ ప్రాణం ఖరీదు’

‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్, మేచో మెగాస్టార్.. ఇవన్నీ సినీ రంగంలో చిరంజీవి కీర్తి కిరీటాలు. అభిమానులు, సినీ పరిశ్రమ, ట్రేడ్ సైతం చిరంజీవి నటన, డ్యాన్సు, ఫైట్స్ లో చూపిన వేగానికి మురిసిపోయారు. తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ టైటిల్ లానే చిన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరానికి చేరుకునేందుకు బలమైన పునాదే వేసుకున్నారు. ‘పునాదిరాళ్లు’ తొలి సినిమాగా 1978 ఫిబ్రవరి 11న ప్రారంభమైనా..

విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

తెలుగు సినిమాల్లో నటుడిగా స్థిరపడాలని వచ్చి అగ్ర నటుడిగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వెనుక చిరంజీవి ఎదురైన పరిస్థితులు కూడా ఓ కారణం. సోదరుడు నాగబాబు మాటల్లో.. ఫంక్షన్లో కుర్చీలో కూర్చున్న చిరంజీవిని అప్పటికే స్థిరపడిన ఓ నటుడు నుంచి ఎదురైన అనుభవం. అప్పుడే.. నటుడిగా కాదు.. అగ్రహీరోగానే ఎదగాలని చిరంజీవి నిర్దేశించుకున్నారని చెప్పారు.

చిరంజీవి నట విశ్వరూపం చూపిన ‘పున్నమినాగు’

చదువు తర్వాత సినిమాల్లోకి వెళ్లాలనుకున్న చిరంజీవి.. ఇదే విషయం తండ్రి వెంకట్రావు గారికి చెప్తే ప్రోత్సహించారు. అయితే.. సక్సెస్ కాలేకపోతే పరిస్థితి ఏంటని అడిగితే.. ‘ఏముంది.. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోతుంది’ అన్నారట చిరంజీవి. తనపై, తనలోని టాలెంట్ పై చిరంజీవికి అంతటి నమ్మకం. దానిని నిరూపించుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తన నటనలోని పదును చూపించారు చిరంజీవి.

సోలో హీరోగా తొలి శతదినోత్సవ సినిమా ‘కోతలరాయుడు’

కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి సినిమా అంటే.. ఈ కుర్రాడు ఎవరు..? బాగా నటిస్తున్నాడు.. కళ్లలో ఫైర్ ఉంది.. అంటూ ఆసక్తిగా చూశారు. విలన్ గా చేసినా.. చిన్న పాత్రల్లో నటించినా.. నలుగురిలో ఒకరిగా నటించినా పరిశ్రమ, ప్రేక్షకుల చూపు తనవైపే ఉండేలా నటించి చిరంజీవి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమా అంటే మినిమమ్ కలెక్షన్లు గ్యారంటీ, ఆపై 100 రోజులు.. ఇప్పుడు 100 కోట్లు కలెక్షన్లు.. ఇలా కొనసాగుతోంది చిరంజీవి స్టామినా..

ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’

చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమకు నెంబర్ వన్ హీరో అయ్యారంటే ఆయనకు ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ కారణం. నాలుగు దశాబ్దాలుగా మాస్ ఇమేజ్ ఆయనకు కవచం. ఆయనకు ఎనలేని కీర్తి కిరీటం. అందుకే ప్రతి హీరో మాస్ ఫాలోయింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. అదొక్కటే సరిపోదు. కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించాలి. 

చిరంజీవిని ప్రేక్షకులకు చేరువ చేసిన శుభలేఖ

హీరోకు ఎన్ని హిట్స్ ఉంటే అంత పాపులారిటీ పెరుగుతుంది. వరుస హిట్స్ ఉంటే రేంజ్ పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ గ్రాఫ్ కూడా అలా వెళ్లిందే. హీరో ఎవరైనా ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే.. ఆ వెంటనే వచ్చే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. దానిని క్యారీ చేయడం వారికి సవాలే అవుతుంది. వెంటనే ఆ స్థాయి హిట్ ఇవ్వడం చాలా కష్టం. కానీ.. చిరంజీవి దీనిని చాలాసార్లు సాధించారు.

‘అభిలాష’లో లాయర్ పాత్రలో జీవించిన చిరంజీవి

సినిమాల్లో హీరో చూపించే హీరోయిజం, మేనరిజం, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. వారికి క్రేజ్ తీసుకొస్తుంది.. అభిమానులను సంపాదిస్తుంది.. ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. అయితే.. హీరో అంటే మాస్, క్లాస్, భావోద్వేగం, ఉత్తేజపరిచే పాత్రలు కూడా చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కథాంశాలు ఎంచుకోవాలి. అయితే.. వారికున్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా కొన్ని కథలను చేయలేరు

సరికొత్త జోనర్లో చిరంజీవి సినిమా గూఢచారి నెం.1

ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే రెండున్నర గంటలపాటు వారిని అలరించాలి. ముఖ్యంగా కథ, పాటలు, ఫైట్లు, కామెడీ అంశాలతో నటీనటులు తమ నటనతో మెప్పించాలి. ఇందుకు కామెడీ, సెంటిమెంట్, ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, గూఢచర్యం (స్పై), కౌబాయ్..

ప్రేక్షకుల మనసుల్లో ‘మగమహారాజు’గా నిలిచిన చిరంజీవి

హీరో కావాలనే కల నుంచి మెగాస్టార్ గా తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసుకునే స్థాయికి చిరంజీవి వెళ్లారు. తొలి సినిమా నుంచి వేసే ప్రతి అడుగు తన కెరీర్ కు ఉపయోగపడేలా వేసుకున్న తీరే నేడు ఎందరికో ఆదర్శం అయింది. సినీ రంగంలోని నటులే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చిరంజీవి మాకు ఆదర్శం అన్నవారు ఉన్నారు. లక్ష్య సాధకుడు ఏం చేస్తాడో..

తెలుగు సినిమా గేమ్ చేంజర్.. చిరంజీవి ‘ఖైదీ’

చిరంజీవికి స్టార్ స్టేటస్ రాకముందే ఆయన తెలుగు సినిమా సేలబుల్ హీరో అయిపోయారు. యూత్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదైనా చిరంజీవి సినిమా అంటే అప్పటికే ఓ క్రేజ్. అలానే 50కి పైగా సినిమాల్లో నటించారు. ఇక స్టార్ ఇమేజ్ వచ్చాక టేబుల్ ప్రాఫిట్ హీరో అయ్యారు. ఆయనకంటూ పర్సనల్ ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్, రైటర్స్ ఏర్పడ్డారు.