వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సెస్ విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన ఆరోపణలు కేంద్రం తోసిపుచ్చింది. వాటిని తాత్కాలికంగా మాత్రమే తమ వద్ద ఉంచుకున్నామని, అందువల్ల దానిని తప్పుబట్టాల్సిన పని లేదని స్పష్టంచేసింది. జీఎస్టీపై కాగ్ ఇటీవల తన ఆడిటింగ్ పూర్తిచేసి నివేదిక సమర్పించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి రెండేళ్లలో రూ.47,271 కోట్లను కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నట్టు కాగ్ పేర్కొంది.
2017 నుంచి ఆ మొత్తాన్ని జీఎస్టీ బకాయిలున్న రాష్ట్రాలకు చెల్లించకుండా జీఎస్టీ సెస్ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిందని వెల్లడించింది. ఇది జీఎస్టీ సెస్ నష్టపరిహారం చట్టానికి విరుద్ధమని స్పష్టంచేసింది. అయితే, వీటిని కేంద్రం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం పన్నులు, సెస్ సహా కేంద్రం వసూలు చేసే మొత్తాలన్నీ తొలుత కన్సాలిటేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)లో జమ అవుతాయి. అనంతరం కేంద్రం బడ్జెట్ లో చేసిన కేటాయింపుల మేరకు వివిధ బడ్జెట్ పద్దుల కింద సీఎఫ్ఐ నుంచి బదిలీ చేస్తారు. ఇదే తరహాలో జీఎస్టీ నష్టపరిహార చట్టం కింద వసూలు చేసిన సెస్ కూడా తొలుత సీఎఫ్ఐ లో జమచేసి, అక్కడ నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)లకు చెల్లిస్తారు. బకాయిలు మొత్తం చెల్లించిన తర్వాత ఏదైనా మొత్తం మిగిలితే దానిని రీకన్సిలియేషన్ ఫండ్ కు తాత్కాలికంగా బదిలీ చేస్తారని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
2017-18లో రూ.62,611 కోట్లు వసూలు కాగా.. రాష్ట్రాలు, యూటీలకు మొత్తం బకాయిలు రూ.41,146 కోట్లు చెల్లించినట్టు చెప్పాయి. అలాగే 2018-19లో రూ.95,081 కోట్లు వసూలు కాగా బకాయిలు రూ.69275 కోట్లు చెల్లించినట్టు వివరించాయి. ఈ మొత్తాలను చెల్లించిన తర్వాత మిగిలిన రూ.47,271 కోట్లను రీకన్సిలియేషన్ నిధికి తాత్కాలికంగా బదిలీ చేసినట్టు పేర్కొన్నాయి. ఇక 2019-20లో రూ.95,444 కోట్లు మాత్రమే వసూలు కాగా, కేంద్రం రూ.165,302 కోట్లను జీఎస్టీ నష్టపరిహరంగా విడుదల చేసిందని వివరించాయి. ఇందులోనే ఆ రూ.47,271 కోట్లు ఉంటాయని తెలిపాయి. అందువల్ల తాము జీఎస్టీ చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదని తేల్చిచెప్పాయి.
675971 339472I observe there is really a lot of spam on this blog. Do you want aid cleaning them up? I may possibly support in between courses! 89941
54661 924086I undoubtedly didnt comprehend that. Learnt some thing new nowadays! Thanks for that. 266396
968691 889651Some times its a pain inside the ass to read what people wrote but this internet site is real user genial ! . 621944
35049 320476You developed some decent points there. I looked on the net for any dilemma and located most individuals goes along with together along with your internet site. 64019