ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మానవాళి చేసిన స్వయంకృతాపరాధమా లేక కుట్ర కోణమా? అనే అంశంపై ఎడతెగని చర్చ సాగుతూనే ఉంది. చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ పుట్టుక వెనుక కుట్ర ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతూ.. చైనా వైపే తమ వేళ్లు చూపిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే డ్రాగన్ దేశంపై శివాలెత్తుతున్నారు.
కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అని సంభోధిస్తున్న ఆయన.. దీనికి ముమ్మాటికీ చైనాయే కారణమని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ వూహాన్ లోని ల్యాబ్ లో సృష్టించారనడానికి తమకు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఈ మేరకు తమ నిఘా విభాగాలు చేసిన దర్యాప్తులో వెల్లడైందని స్పష్టంచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పై మరోసారి మండిపడ్డారు. ఆ సంస్థ పనితీరు చూస్తుంటే చైనాకు ప్రజా సంబంధాల ప్రతినిధిగా పనిచేస్తున్నట్టు ఉందని, దీనికి సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు అసలు ఈ వైరస్ చైనా సృష్టే అన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ల్యాబ్ లో సృష్టించిన ఈ వైరస్ లీక్ అయిన విషయంలో ఏదో మతలబు ఉందని ఎక్కువ దేశాలు అనుమానిస్తున్నాయి. ఎయిడ్స్ కు వాక్సిన్ రూపొందించే క్రమంలో ఇది లీకై ఉండొచ్చని ఓ వాదన ఉండగా.. కావాలనే లీక్ చేసి ఉండొచ్చని మరో వాదన కూడా జోరుగా నడుస్తోంది.
ముందుగా వైరస్ సృష్టించి ప్రపంచం దాని కోరల్లో విలవిలలాడుతున్న సమయంలో వాక్సిన్ కనుగొన్నామని చెప్పి దానిని విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము, పేరు పొందొచ్చనే దురాలోచనతోనే ఈ పనికి పాల్పడి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే, చైనా వీటిని తీవ్రంగా ఖండిస్తోంది. గబ్బిలాల ద్వారానే ఈ వైరస్ వచ్చిందని, ఇందులో మానవ ప్రమేయం ఏమీ లేదని పేర్కొంటోంది. అయితే, అమెరికా తమపై తీవ్ర ఆరోపణలు చేసేసరికి, ఆ దేశమే తమ సైనికుల ద్వారా చైనాలో ఈ వైరస్ ను చొప్పించదని ప్రతి ఆరోపణలూ చేసింది. అదే సమయంలో దీనిపై విచారణ జరిపేందుకు తమకు అనుమతి ఇవ్వాలన్న అమెరికా అభ్యర్థనను డ్రాగన్ కంట్రీ తోసిపుచ్చింది.
మరోవైపు డబ్ల్యూహెచ్ఓ సైతం ఎప్పటికప్పుడు చైనాకు అనుకూలంగా వ్యవహరించి, ఈ మహమ్మారిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ వైరస్ బారిన పడి కోలుకోని విధంగా నష్టపోయింది. అయితే, ఈ వైరస్ పుట్టక విషయంలో అసలైన నిజాలు ఇప్పటికీ బయటకు రాలేదు. డ్రాగన్ నోరు విప్పితే తప్ప ఇది బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఆ పని ఆ దేశం ఎప్పటికీ చేయదు.
77796 931293Some actually excellent info , Gladiola I identified this. 707468