ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.!
సక్సెస్, ఫెయిల్యూర్.. వీటికి అతీతంగా, మెగాస్టార్ చిరంజీవి స్టార్‌డమ్ కొనసాగుతోంది. కెరీర్ ప్రారంభంలో ‘నీ మొహం అద్దంలో చూసుకున్నావా.?’ అనే వెటకారాల్ని ఎదుర్కొన్న చిరంజీవి, కోట్లాదిమంది అభిమానులు ‘నేను చిరంజీవిలానే వున్నానా.?’ అని తమను తాము అద్దంలో చూసుకుని, సోకులద్దుకునే స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా, ఒదిగి వుండడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా.
ఆల్రెడీ చెప్పుకున్నట్లు.. చిరంజీవి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.. ఎదుర్కొంటూనే వున్నారు. ఇప్పుడు ట్రోలింగ్.. అనే పేరు కొత్తగా వినిపిస్తోందంతే. కానీ, పనిగట్టుకు చేసే దుష్ప్రచారాన్ని ఢీ కొట్టడం చిరంజీవికి కొత్త కాదు. ఎంత గట్టిగా దెబ్బ తగిలితే, అంత రాటుదేలుతా.. అన్నట్లు చిరంజీవి, కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగారు.
ఇప్పటికీ చిరంజీవి మీద అదే ‘దారుణమైన దాడి’ జరుగుతోంది. ‘ఇంట్లో అమ్మాయిలు ఎక్కువ వున్నారు.. మన లెగసీ కోసం ఓ మనవడిని చరణ్ ఇస్తే బావుణ్ణు..’ అని సరదాగా ఓ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడితే, దాన్ని వివాదాల్లోకి లాగారు కొందరు నిశానీగాళ్ళు.!
తన ఇంట్లో అమ్మాయిల్ని చిరంజీవి లక్షీదేవిలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనవరాళ్ళ గురించి ‘లవ్లీ కిడ్స్’ అంటూ, ‘మనవడి కామెంట్’లోనే చిరంజీవి ప్రస్తావించినా, అది మాత్రం ఎవరూ ప్రస్తావించడంలేదు.
అదే సినీ వేడుకలో, తన తాతయ్య గురించి ప్రస్తావిస్తూ చిరంజీవి లైటర్ వీన్‌లో చేసిన సరదా వ్యాఖ్యల్ని సైతం ట్రోల్ చేస్తున్నారు కొందరు. కుటుంబానికి, కుటుంబ సభ్యులకి చిరంజీవి ఇచ్చే గౌరవం, ఆ కుటుంబ పెద్దగా చిరంజీవికి వున్న బాధ్యత.. గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
అయినా, చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుందా.? ఏమీ రాదు, అదొక శునకానందం అంతే.! ముందే చెప్పుకున్నట్లు, చిరంజీవిని విమర్శించాలని ఎవరు ఎంతలా అనుకున్నా, ఆయనేమీ చలించే వ్యక్తి కాదు.! చిరంజీవి అంటే మెగా శిఖరం.! కొండని చూసి కుక్కలు మొరిగితే, ఆ కొండకి చేటా.? అన్న మాట మెగాస్టార్ చిరంజీవి అనే శిఖరానికి సరిగ్గా సూటవుతుంది.
అక్కసుని కొన్ని మీడియా సంస్థలు.. ఇలా చిరంజీవి మీద ప్రదర్శించడం మామూలే.! ఇక, సోషల్ మీడియా ట్రోలింగ్ విషయానికొస్తే, ‘పెడిగ్రీ’కి కక్కుర్తి పడే పేటీఎం గ్రామ సింహాలకి కొదవే లేదు.! ఆపై కుల జాడ్యం సంగతి సరే సరి.!
చిన్న సినిమాల్ని ప్రోత్సహించే క్రమంలో చిరంజీవి, ఆయా సినీ వేడుకలకు హాజరవడం, అక్కడ సందర్భాన్ని బట్టి సరదా వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించడం.. ఇవన్నీ చిరంజీవి స్పాంటేనిటీ అలాగే బాధ్యతకి నిదర్శనాలు. చిరంజీవి హ్యూమర్ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే.