మంచు విష్ణు పరిస్థితి మరి దారుణంగా తయారైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తో అయన నటించిన సినిమాకు ప్రేక్షకులు కరువై .. షో లను నిలిపివేసే పరిస్థితికి వచ్చింది. ఆ సినిమాను చూసే జనాలు కరువై .. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ లో ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే .. మంచు విష్ణు హీరోగా కొత్త దర్శకుడితో ఓటర్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తీ చేసుకున్నా కానీ.. .విడుదల విషయంలో వాయిదాలు పడుతూనే ఉంది. ఫైనల్ గా ఈ నెల 21న నాలుగైదు సినిమాలతో కలిసి విడుదల చేసారు ..కానీ ఏమి లాభం .. ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులే లేరు !!
అసలు మొదటి రోజు .. థియేటర్స్ లో 70 పర్సెంట్ ఖాళీగా కనిపించాయి .. ఓటర్ సినిమా విడుదలైంది అన్న విషయం చాలా మంది జనాలకు తెలియదు. పోనీ రెండో రోజైన ప్రేక్షకులు వచ్చారా అంటే .. మొదటి రోజే బెటర్ అనే తరహాలో ఉంది పరిస్థితి. చాలా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక షో లను నిలిపివేశారట !! పోనీ మీడియా జనాలైన చూసారా ? అంటే అది లేదు .. ఓటర్ గురించి రివ్యూస్ కూడా కనిపించడం లేదు. మరి ఇంత దారుణంగా ఆ సినిమాను ఎందుకు విడుదల చేసారు ? అన్నది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.
ఎంతో కష్టపడి సినిమా తీసి .. దాన్ని చూసే జనాలకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసి .. ఆ తరువాత చేతులు కాలాయి దేవుడో అంటే ఎం లాభం .. ఈ ఓటర్ సినిమా విషయంలో అటు నిర్మాతలు కానీ ఇటు హీరోగాని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ విషయంలో నిర్మాతల స్పందన ఏమిటో !! ఈ మధ్య కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని మంచు విష్ణు కనీసం ఇప్పటికైనా మంచి సినిమాలు ఎంచుకుంటూ చేస్తే బాగుంటుంది. లేదంటే .. మరో కెరీర్ చూసుకోవలసిందే !!