Switch to English

జగనన్న సమర్పించు.. ‘వాలంటీర్‌ – బంపర్‌ హిట్‌’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన వాలంటీర్‌ వ్యవస్థ సూపర్‌ హిట్‌ అయ్యిందా.? గత నెల నుంచి ప్రారంభమయిన ఇంటి వద్దకే పెన్షన్ల కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్లు అత్యంత విజయవంతంగా పూర్తి చేయడంతో.. ఈ గ్రామ వాలంటీర్‌ వ్యవస్థని అద్భుతః అని కొనియాడాల్సిందేనా.? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.

గత నెలలో పెన్షన్లకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి. వెంటనే తేరుకున్న ప్రభుత్వం, ఈసారి ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా పనిచేసింది. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ సూపర్‌ హిట్‌ అయ్యిందని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. మధ్యాహ్నానికే 80 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, క్యూ లైన్లలో నిల్చునే పనిలేకుండా లబ్దిదారుల ఇళ్ళ వద్దకే పెన్షన్లు గ్రామ వాలంటీర్ల ద్వారా వెళ్ళాయి.

నిజానికి, గ్రామ వాలంటీర్లకు చాలా పనుల్ని ప్రభుత్వం అప్పగించింది. ఆ పనుల ఒత్తిడి చాలా తీవ్రంగానే వుంది వాలంటీర్ల మీద. గ్రామ సచివాలయం అనీ.. ఇంకోటనీ.. చాలా హంగామా వైసీపీ ప్రభుత్వం చేసింది.. చేస్తోంది కూడా. ఇంకా ఇవన్నీ తొలి దశలోనే వున్నాయి గనుక.. ముందు ముందు వీటి పనితీరుపై ఓ స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే ఆయా వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయని అనుకోవాలి. అదే సమయంలో, కొన్ని విమర్శల్నీ ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రభుత్వం ఈ వ్యవస్థల కారణంగా. వాలంటీర్లలో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్న వైనం తెరపైకి వస్తోంది.

అబ్బే, ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం ఎంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ. ఇదిలా వుంటే, పని భారం అత్యంత తీవ్రంగా వుందనీ, ఎక్కువ కాలం వాలంటీర్లుగా కొనసాగలేమని ఆఫ్‌ ది రికార్డ్‌గా చాలామంది గ్రామ వాలంటీర్లు చెబుతున్నారు. బయట పనులకు వెళ్ళినా, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకున్నా.. చెప్పుకోదగ్గ స్థాయిలో వేతనాలు అందుతున్నాయనీ.. వాలంటీర్లుగా సంపాదన చాలా చాలా తక్కువన్నది వారి వాదన.

మరోపక్క, కేవలం వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్‌ పోస్టులు ఇచ్చుకున్నామని గతంలోనే వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి చెప్పానుకోండి.. అది వేరే సంగతి. ఏదిఏమైనా, కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ్యత ప్రజలకు తప్పినందున.. ప్రస్తుతానికి వాలంటీర్‌ వ్యవస్థ బంపర్‌ హిట్టే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...