Switch to English

వాలంటీర్లు.. ఏపీకి వెన్నెముకే..!

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు బాగా అక్కరకొస్తోంది. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరవేయడంలోనూ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలోనూ వాలంటీర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించే చర్యల్లోనూ వీరి భాగస్వామ్యం విశేషంగా ఉంది.

ఎన్నికలకు ముందుగానే తాను అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తానంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లనే దాదాపు నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించారు. అయితే, వైఎస్సార్ సీపీ కార్యకర్తలకే ఈ ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి.

ఈ విషయాన్ని అలా పక్కన పెడితే.. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏపీ సర్కారుగా తిరుగులేని బలంగా మారింది. ఇందులో నియమితులైనవారంతా యువతీ యువకులే కావడం.. ఒక్కొక్కరి పరిధిలో కేవలం 50 ఇళ్లు మాత్రమే ఉండటంతో ప్రతి పనీ చకచకా సాగిపోతోంది. ప్రస్తుతం కరోనా సంబంధిత వివరాలు తెలుసుకోవడానికి కూడా గ్రామ వాలంటీర్ల సేవలు చక్కగా ఉపయోగపడుతున్నాయి.

ఇటీవల కాలంలో విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు తెలుసుకునే బాధ్యతను ప్రభుత్వం వీరికే అప్పగించింది. దీంతో దాదాపు 12వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వారి ఇళ్లకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను పంపించి పరీక్షలు నిర్వహించింది. అనుమానిత లక్షణాలనున్నవారిని క్వారంటైన్ కు తరలించింది.

దీంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ బాగుందంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. మొత్తానికి గ్రామ వాలంటీర్లు ఏపీకి వెన్నెముకగా మారారు. అయితే, చేయించుకుంటున్న పనితో పోలిస్తే వీరికి ఇచ్చే వేతనం తక్కువనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపైనా సర్కారు కాస్త దృష్టి పెడితే బాగంటుంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

ఫ్లాష్ న్యూస్: ఏసీలో మంటలు.. బీజేడీ నేత మృతి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్‌గావ్‌లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్‌ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి...

పోతిరెడ్డిపాడుపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో...

భార్య భర్తలకు కిమ్‌ ఉరిశిక్ష.. క్రూరత్వంకు పరాకాష్ఠ

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిం జోంగ్‌ ఉన్‌ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని కనీసం కేసు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...