Switch to English

విశాఖ రైల్వే జోన్‌పై వైసీపీ చిత్తశుద్ధి ఇంతేనా.?

ప్రత్యేక హోదా ఎటూ రాదు. పోనీ, ప్రత్యేక రైల్వే జోన్ అయినా వచ్చే అవకాశం వుంది గనుక, దాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేలా చూడొచ్చు కదా.? 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రత్యేక రైల్వే జోన్ అంశంలో కదలిక వచ్చింది.. దాంతో, బీజేపీ శ్రేణులు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అప్పటికీ, ఇప్పటికీ.. అంటే, గడచిన రెండున్నరేళ్ళలో ఏం మారిందని.? ఏమీ మారలేదు. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది.? అంటే, అప్పుడెక్కడుందో, ఇప్పుడూ అక్కడే వుందని కేంద్రం తాపీగా పాత మాటే చెప్పింది సరికొత్తగా.

ప్రత్యేక రైల్వే జోన్ వైఫల్యం పూర్తిగా రాష్ట్రంలో అధికారం వెలగబెట్టిన, వెలగబెడ్తున్న పార్టీలదే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ పాపంలో అసలు భాగం బీజేపీదేననుకోండి.. అది వేరే సంగతి. చంద్రబాబు హయాంలో విశాఖ రైల్వే జోన్ కాస్తా, గుంటూరు లేదా విజయవాడ రైల్వే జోన్ తరహాలో మార్చేందుకు తెరవెనుకాల ప్రయత్నాలు జరిగాయి. దాంతో, విశాఖ రైల్వే జోన్ అంశం ఆలస్యమయ్యింది.

నిజానికి, బీజేపీ చెప్పిన కుంటి సాకుల్లో.. ‘కమ్మ జోన్’ అనే వాదన కూడా ఒకటి. విశాఖ రైల్వే జోన్ అమల్లోకి తీసుకురావడం అనేది నిజానికి కేంద్రానికి చాలా చాలా చిన్న విషయం. కానీ, ఇందులో కూడా మోడీ సర్కార్ రాజకీయ లబ్ది కోసమే చూస్తోంది. లేకపోతే, ఏడేళ్ళుగా రైల్వే జోన్ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైతే.. అసలు దేశంలో పరిపాలన అనేది వుందా.? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీలు ఏం సాధిస్తున్నాయి.? అన్న అనుమానాలు కలగకుండా వుండవు.

పార్లమెంటు సాక్షిగా గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీలు పోరాటం (?!) చేసేస్తున్నారు. వీరి ఆరాటం, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అర్హత వేటు కోసం తప్ప, రాష్ట్రం కోసం కానే కాదు. లేకపోతే, రైల్వే జోన్ అంశంపై ఎందుకు పార్లమెంటు సాక్షిగా ఆందోళన చేయలేకపోతున్నారు వైసీపీ ఎంపీలు.? రాష్ట్రంలో అధికార పార్టీగా వైసీపీ, రాష్ట్రం నుంచి రైల్వే జోన్ విషయమై ఉద్యమ నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఆందోళన చేయొచ్చు.

కానీ, అలా చేస్తే.. బీజేపీ అధిష్టానానికి కోపమొస్తుంది. అందుకే, తూతూ మంత్రం ఆందోళనలు తప్ప, చిత్తశుద్ధితో ఏ విషయమ్మీదా వైసీపీ మాట్లాడలేకపోతోంది.. అదే రాష్ట్రానికి శాపంగా మారుతోంది. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. ఏమీ మారలేదు.. రాష్ట్ర ప్రజల తల రాత అస్సలు మారడంలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఎక్కువ చదివినవి

టాలెంటెడ్ సంగీత దర్శకుడితో నాని సినిమా

న్యాచురల్ స్టార్ నాని రెగ్యులర్ గా సినిమాలను లైన్లో పెడతాడు. సినిమా సినిమాకూ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోవడం కూడా నచ్చదు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను షూటింగ్ కు...

మోహన్‌బాబుకి మెగా కౌంటర్ ఎటాక్ సిద్ధమౌతోందా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాతా మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, అలాగే ‘మంచు’ వర్గంగా చెప్పబడుతోన్న నరేష్ సహా మరికొందరు, మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా నానా...

టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్..! ఇయర్ ఫోన్స్ ఆర్డర్ ఇస్తే..

ఈ-కామర్స్ లో ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుకు వేరే వస్తువు డెలివరీ వస్తూంటుంది. ఆమధ్య యాపిల్ పళ్లు ఆర్డర్ ఇస్తే యాపిల్ ఫోన్ వచ్చిన సందర్భం కూడా చూశాం. అయితే.. ఓ టీవీ...

కోట ‘కమ్మ’టి తిండి: కుల పైత్యం ఈ స్థాయిలోనా.?

సినీ పరిశ్రమలో కుల పైత్యం వుందా.? లేదా.? నూటికి నూరు పాళ్ళూ వుందంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఈ రోజుల్లో కూడా ఈ జాడ్యమా.? అంటే, దానికి కోట నుంచి ‘ఔను’...

బిగ్ బాస్ 5: రవి దొరికాడు, శ్వేతా నెగటివ్ అయింది!! -ఎపిసోడ్ 40

బిగ్ బాస్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. బొమ్మల ఫ్యాక్టరీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వచ్చాయి. మొత్తం అన్ని బొమ్మలు లెక్కపెట్టిన తర్వాత గ్రీన్ టీమ్ వద్ద ఎక్కువ...