Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: జర్నలిజం కాదది బానిసత్వం.!

మీడియా అంటే ప్రజల పక్షాన నిలబడాలి. అధికారంలో వున్నవాళ్ళు ప్రజలకు ఎంత గొప్ప పాలన అందించినా, ‘ఇంకాస్త చేసి వుంటే బావుండేది’ అని మీడియా, ప్రజల తరఫున డిమాండ్‌ చేయాల్సిందే. విపక్షాలు చేసే విమర్శల్లో అర్థం వున్నా, లేకపోయినా.. కాస్తో కూస్తో విపక్షాల తరఫున మాట్లాడి, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితేనే అది మీడియా అవుతుంది. కానీ, గత కొంకాలంగా మీడియా ‘నైతిక విలువలకు’ తిలోదకాలిచ్చేసిన మాట వాస్తవం.

అధికార పార్టీలకు ‘బాకా ఊదడం’ మొదలయ్యాక, ఓ సెక్షన్‌ మీడియా ప్రజల్ని పట్టించుకోవడమే మానేసింది. ఎంతసేపూ అధికార పార్టీ భజన తప్ప, ఇంకో ఆలోచనే మీడియాకి వుండడంలేదన్న విమర్శ కొన్ని మీడియా సంస్థల మీద విన్పిస్తోంది. గతంలో ఎల్లో మీడియా గురించి మాట్లాడుకున్నాం.. ఇప్పుడు బ్లూ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం. అంతే తేడా.

జర్నలిజంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన కొందరు, ‘నామినేటెడ్‌ పదవుల కోసం’ పడుతున్న కక్కుర్తి కారణంగా, మీడియాలో విలువలు మరింత పతనమైపోతున్నాయి. ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌, అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోతే, ‘అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన విషవాయువు కాదట కదా..’ అంటూ చర్చా కార్యక్రమంలో వెకిలి వ్యాఖ్యలు చేశారా జర్నలిస్ట్‌.

తాజాగా, ‘ముఖ్యమంత్రి, బాధితులకు కోటి ఇచ్చారు. అంత పెద్ద అమౌంట్‌ ప్రకటించినా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా.?’ అంటూ ఊగిపోయారాయన. కోటి రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించిన దరిమిలా, ఆ ప్రకటనను ఆహ్వానించాల్సిందే. అదే సమయంలో, ఇంకో కోటి రూపాయలు బాధిత కుటుంబాలకు వస్తే బావుండేదని మీడియా, ప్రజల తరఫున నినదించడమే కదా సామాజిక బాధ్యత. పైగా, ‘మాకు డబ్బులొద్దు.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలకు వెల కడ్తారా.? మమ్మల్ని నాశనం చేస్తోన్న ఫ్యాక్టరీని మూసేసి, ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇవ్వండి..’ అంటూ జనం నిలదీస్తోంటే, ఆ ప్రజల్ని అవమానించడమేంటి.?

న్యూస్‌ ఛానళ్ళు, పత్రికలే కాదు, వెబ్‌ మీడియా కూడా ‘బానిసత్వానికి’ అలవాటుపడిపోతే, ప్రజల తరఫున ప్రశ్నించేదెవరు.?

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

షాకింగ్: వలస కూలీ ఆకలి కేక.. చచ్చిన కుక్కను తింటూ.!

దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు...

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...