Switch to English

సిగ్గు సిగ్గు: ‘కోటి’ కోసం చచ్చిపోదామనుకుంటున్నారట

పది రూపాయల కోసం ప్రాణాలు తీసే మానవ మృగాల గురించి వింటున్నాం. కానీ, కోటి రూపాయల కోసం చచ్చిపోవాలనుకుంటున్న వారిని చూడగలమా.? ఏమో, ఎక్కడన్నా వున్నారేమో.! వారి కష్టం ఎలాంటిదో ఏమో.! కానీ, అలాంటోళ్ళు వుంటారని ఎవరూ అనుకోం. అయితే, అధికార వైఎస్సార్సీపీ మాత్రం, ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన కోటి ఎక్స్‌గ్రేషియా చూసి.. అయ్యో, మేం చచ్చిపోయినా బావుండేది.. మా కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేది..’ అనుకుంటున్నారని చెబుతోంది.

అధికార పార్టీకి చెందిన ఓ నేత, పైగా ప్రజా ప్రతినిది¸.. అధికార పార్టీకే చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో చేసిన జుగుప్సాకరమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల సారాంశమిది. ‘20 లక్షలు ఎక్కువ వాళ్ళకి.. అలాంటిది మా ముఖ్యమంత్రి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు’ అని ఓ మంత్రి, మనిషి ప్రాణానికి విలువ కట్టి హీనంగా మాట్లాడితే, కింది స్థాయి నేతలు ఇంకెంతగా చెలరేగిపోతారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై అధికార పార్టీ నేతల అవాకులు చెవాకులు శృతిమించిపోతున్నాయి. నిజానికి, జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. అదే సమయంలో, అది పూర్తి నిర్లక్ష్యంగానే చోటు చేసుకున్న మానవ తప్పిదం. అందుకే, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థను ఆదేశించింది.

మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? అది గొప్ప సంస్థ.. ఫ్యాక్టరీ నిర్వహణలో వాళ్ళకి మంచి పేరుంది.. అంటూ ముఖ్యమంత్రి కితాబులివ్వడంలోనే తెరవెనుక ‘లాలూచీ’ సుస్పష్టంగా తెలిసిపోతోంది. మనిషి ప్రాణానికి వెలకట్టే స్థాయి ఎవరికైనా వుందా.? ఛాన్సే లేదు.

పైగా, ‘మీరిచ్చే కోటి రూపాయలు మాకొద్దు.. మా బిడ్డ ప్రాణం ముందు ఈ కోటి రూపాయలు ఎక్కువేం కాదు.. మాకు న్యాయం కావాలి..’ అని బిడ్డను కోల్పోయిన తల్లి, ‘రెండు కోట్లిస్తాం.. మా కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తారా.?’ అని తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితులు ప్రశ్నిస్తున్న వేళ, కోటి కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా వున్నారని ఓ ప్రజా ప్రతినిది¸ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేయడమంటే.. వీళ్ళని రాజకీయ నాయకులు అనగలమా.? అసలు మనుషులని అనగలమా.?

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

కిడ్నీ కొంటామని డబ్బులు ఎదురు దోచేశారు..

తల్లిదండ్రులకు ఆర్ధికంగా అండగా నిలుద్దామని ఆలోచించింది ఓ మహిళ. ఇందుకు తాను చేస్తున్న పనితో మరింత నష్టపోతున్ననని గ్రహించలేదు. సదరు మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది....

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా...

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...