Switch to English

అక్కడ అడుగు పెడితే ఇక అంతేనా…?

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన పెనువిషాదం యావత్ దేశాన్నే ఉలికిపాటుకు గురిచేసింది. సుమారు పన్నెండు మంది మృత్యువాత పడిన ఈ ఘటనలో కొన్నివందలమంది బాధితులు ఇంకా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి గోదావరి బోటు ప్రమాదం వంటి పెనువిషాదాలు రాష్ట్రంలో కొన్ని చోటుచేసుకున్నప్పటికీ నాడు వ్యక్తిగతంగా బాధితులను పరామర్శించని ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటనకు మాత్రం చాలా వేగంగా స్పందించటం విశేషం.

హుటాహుటిన వైజాగ్ బయలుదేరి వెళ్లిన జగన్, బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. కోటిరూపాయల సాయం ప్రకటించి ప్రతిపక్షాలకు సైతం షాకిచ్చారు. అయితే ఈ కోటి సాయం వెనక ఉన్న పరిణామాలు, జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని పట్టించుకోకుండా నేరుగా ప్రధాని కార్యాలయం ఇన్ వాల్వ్ అయి విచారణ జరుపుతున్న తీరూ, ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన కంపెనీపై కఠిన చర్యలు ఎందుకు లేవన్న విమర్శలూ గ్యాస్ కంటే వేగంగానే వ్యాపిస్తున్నాయి.

అయితే వీటన్నింటినీ మనం కాసేపు పక్కనబెడితే జగన్ వైజాగ్ పర్యటన ఇప్పుడు ఇంకోరకంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే విశాఖలో ఒకటిన్నర శతాబ్ధంపైగా సేవలందిస్తోన్న కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) ను ముఖ్యమంత్రి జగన్ సందర్శించటం. అవును , ఇప్పుడు వార్త ఏంటంటే ఆ హాస్పిటల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి త్వరలోనే పదవీచ్యుతుడవుతాడరన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

1995 లో ఈ ఆస్పత్రిని సందర్శించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆ తర్వాత కొద్దికాలంలోనే తనపదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ తర్వాత పదవి చేపట్టిన ఏముఖ్యమంత్రి కూడా ఈ 25 ఏళ్లలో ఆ హాస్పిటల్ వైపు అడుగుపెట్టలేదు. ఇంతకాలానికి మళ్లీ జగన్ అక్కడ అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీంతో అసలే అన్ లిమిటెడ్ కష్టాలతో కాలం గడుపుకొస్తోన్న తమకు మళ్లీ ఈ సెంటిమెంట్ షాకులేంట్రా బాబూ అని జగనన్న శిబిరం తెగ ఆందోళన పడుతోంది. పైకి మాత్రం కేజీహెచ్ తో పాటూ అన్నవరం ఆలయానికి వెళ్తే పదవీగండం, నాగార్జున యూనివర్శిటీకి వెళ్తే సీఎం పదవి ఊస్టింగేనని ఆల్రెడీ ఉన్న జనంలో నానుతున్న నమ్మకాలను మూఢనమ్మకాలుగా తేల్చేసి వాటిని కొట్టిపారేస్తున్నారు. పీవీపీ లాంటి వైసీపీ నేతలైతే ట్వీట్ల ద్వారా ఇంకొంచెం హీటు పెంచుతున్నారు. బాధితుల దగ్గరకు వెళ్లటం ముఖ్యం కానీ సెంటిమెంట్లను చూసి ఆగటం తమ నాయకుడి లక్షణం కాదని ధీమా వ్యక్త చేస్తున్నారు.

పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం ఈ సెంటిమెంట్ వర్కవుట్ కాకూడదని వారికి నచ్చిన, వారు మెచ్చిన దేవుళ్లను కోరుకుంటున్నారు. ఇక ప్రత్యర్ధి శిబిరం ఫోన్లు అయితే ఈ అంశంపై బిజీగానే ఉన్నాయి. ఎవరి ఆశలు వారివి…ఎవరి నమ్మకాలు వారివి..అసలు ఆస్పత్రులకు వెళ్లటం..అక్కడికి వెళ్తే పదవులు పోతాయన్న వార్తలు ఏమో కానీ ఇలాంటి దారుణాలు మాత్రం జరగకూడదని మనం కోరుకుందాం..ఎందుకంటే ఏది జరిగినా దాన్ని రాజకీయానికి ముడిపెట్టే ఏపీలో ఉన్నాం కాబట్టి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

వ్యభిచార కేంద్రంలో పట్టుబడ్డ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక ఉన్నతాధికారి అత్యంత నీచంగా తన స్థాయిని మర్చి పోయి తుచ్చమైన శృంగార కోర్కెలను తీర్చుకోవడానికి వ్యభిచార గృహంకు వెళ్లాడు. ముంబయి నుండి హైదరాబాద్‌ కు ప్రత్యేకంగా ఇందుకోసమే...

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ...