విశాఖపట్నంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఓ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే, జాతీయ స్థాయిలో ఆ మాటకొస్తే ప్రపంచ స్థాయిలో విశాఖ ప్రజల పట్ల సానుభూతి వ్యక్తమయ్యింది. క్రికెటర్లు, సినిమా రంగానికి చెందినవారు ‘ప్రే ఫర్ వైజాగ్’ అంటూ ప్రార్థించారు.
కానీ, రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన ‘కులపిచ్చి’గాళ్ళు మాత్రం, సోషల్ మీడియా వేదికగా నికృష్ట రాజకీయ విమర్శలు షురూ చేశారు. ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరుతో ఫేక్ ట్వీట్ రూపొందించి, ‘దేవుడు వున్నాడురా.. మా అమరావతి ప్రజల ఏడుపు తగిలే వైజాగ్ వాళ్ళకి ఇలా జరుగుతుంది..’ అంటూ విద్వేషం రగల్చాలనుకున్నారు.
ఈ సమయంలో ఈ తరహా కుల రాజకీయాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు అవసరమా.? ‘అరే కుక్కల్లారా రాజధాని కావాలా మీకు.. కుక్క చావు చావండిరా.. జై అమరావతి’ అంటూ మరో ఫేక్ కామెంట్ని ప్రచారంలోకి తెచ్చారు. వీటిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. జరిగిన ‘మార్ఫింగ్’ వ్యవహారంపై సీరియస్ అయ్యింది. అధికార పార్టీ మద్దతుదారులు ఇంత దారుణానికి తెగబడ్డం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.
సోషల్ మీడియాలో ఈ తరహా ఫేక్ వ్యవహారాలు చోటు చేసుకుంటే కరిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, దురదృష్టవశాత్తూ అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే ఈ తరహా ఫేక్ చర్యలకు పాల్పడుతున్నారు. దాంతో, పోలీస్ వ్యవస్థ నిందితులపై చర్యలు తీసుకోలేకపోతోందన్న విమర్శలున్నాయి. నిజానికి, ఇప్పుడు.. ఈ సందర్భంలో జరుగుతున్న ఫేక్ వ్యవహారాన్ని ‘విద్రోహ చర్య’గా భావించాల్సి వుంటుంది. మరి, ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటుందా.?
553419 695707Thank you for your very good info and respond to you. I need to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make people believe. Additionally, thanks for allowing me to remark! 820469
506893 658033Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually via the entire wedding party and are still required to be really intriguing, amusing and even enlightening together. greatest mans speech 319734
652858 5158You got a really good web site, Gladiola I discovered it by way of yahoo. 167762