అదేంటీ, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో వితిక, పునర్నవి కనిపించడమేంటి.? కనిపిస్తే కనిపించారు.. కొట్టుకోవడమేంటి.? గతంలో ఈ ఇద్దరూ బిగ్ హౌస్‌లో వుండేవారు. అది వేరే సీజన్. కానీ, ఈ ఎనిమిదో సీజన్‌లోకి ఈ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చింది, టిక్కెట్ టు ఫినాలే రేస్ కోసం కంటెండర్ల ఎంపిక కోసం.
వస్తే వచ్చారుగానీ, ఈ కొట్టుకోవడమేంటి.? ఔను, నిజంగానే కొట్టుకున్నారు. అదీ, గౌతమ్ విషయంలో.! గౌతమ్ కోసం ఇద్దరూ కొట్టుకోవడమేంటో.? సీరియస్‌గా కాదు లెండి.. సరదాగానే.! నిఖిల్‌ని కంటెండర్‌గా వితిక ప్రతిపాదించింది. గౌతమ్ పేరుని తెరపైకి తెచ్చింది పునర్నవి. కాకపోతే నిఖిల్ – పృధ్వీలను కంటెండర్లను చేయాలని వితిక అనుకుంది.
కానీ, గౌతమ్ వైపు పునర్నవి మొగ్గు చూపింది. ‘ఏం, అంత నచ్చాడా.?’ అంటూ వితిక, పునర్నవిని ర్యాగింగ్ చేసింది. దాంతో, పునర్నవి నొచ్చుకుంది.. అదీ సరదాగానే.! ‘నీకు బలిసింది..’ అంటూ పునర్నవి కొట్టింది వితికని. వితిక కూడా, పునర్నవిని కొట్టింది.
పునర్నవి దృష్టిలో గౌతమ్‌తోపాటు టేస్టీ తేజ పేరు కూడా వుంది కంటెండర్ కోసం. వితిక అడిగే సరికి, పృధ్వీ పేరు కూడా వుందిగానీ.. అనేసింది పునర్నవి.
ఇక, హౌస్ మేట్స్‌తో ముచ్చట్ల సందర్బంగా, లవ్ – స్నేహం.. వంటి విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు పునర్నవి, వితిక. నబీల్ తాను ప్రస్తుతానికి సింగిల్ అని చెప్పాడు. పృధ్వీ, తనకు ప్రేమ విషయంలో స్నేహం విషయంలో పూర్తి క్లారిటీ వుందని చెప్పాడు.
మొత్తమ్మీద, పునర్నవి అలాగే వితిక రాకతో హౌస్‌లో గ్లామర్ ఒక్కసారిగా పెరిగినట్లయ్యింది. వితిక, ఆమె భర్త వరుణ్ సందేశ్ ఓ సీజన్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క పునర్నవి అయితే ఓ సీజన్ మొత్తానికి మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్. రాహుల్ సిప్లిగింజ్‌తో కలిసి పునర్నవి బిగ్ హౌస్‌లో పండించిన రొమాంటిక్ ట్రాక్.. బిగ్ బాస్ హిస్టరీలోనే వెరీ వెరీ స్పెషల్.
బిగ్ బాస్ తర్వాత విదేశాలకు ఉన్నత విద్య నిమిత్తం వెళ్ళిపోయింది పునర్నవి. పునర్నవి – రాహుల్ మధ్య లవ్ ట్రాక్.. కేవలం బిగ్ బాస్ రియాల్టీ షో వరకే పరిమితమైపోయింది.