Viswambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. యూవీ బ్యానర్లో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలో మేకర్స్ రివీల్ చేసిన అప్డేట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ సినీ వేదిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతోంది. ఈ ఉత్సవంలో ‘విశ్వంభర’ గ్లింప్స్ ప్రదర్శించనున్నారనే అప్డేట్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే కంటెంట్ కాబట్టి అంతర్జాతీయస్థాయిలో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. ‘ఎపిక్ రివీల్’ పేరుతో నేడు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో వీఎఫ్ఎక్స్ కు భారీ స్కోప్ ఉంది. ఫెస్టివల్ లో ‘విశ్వంభర’ ప్రధాన ఆకర్షణ కానుంది. త్రిష, ఆషికా రంగనాధ్ హీరోయిన్లు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
MEGA MASS CROSSES BORDERS AND GOES GLOBAL ❤️🔥
Producer Vikram Reddy takes #Vishwambhara to Cannes – with an EPIC REVEAL offering a glimpse into the world of Vishwambhara at the international stage 💥💥
Stay tuned for the EPIC REVEAL tomorrow. ⏳#Vishwambhara #Cannes2025
MEGA… pic.twitter.com/Sot4KmzzID— UV Creations (@UV_Creations) May 21, 2025
