`ఫలక్నుమా దాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా, నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన రెండవ సినిమా ‘హిట్’. శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
క్లైమాక్స్ కొంతవరకూ సంతృప్తి పరచకపోయినప్పటికీ సూపర్ గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ థ్రిల్స్ వలన మొదటి రోజు ప్రేక్షకులని మెప్పించి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. విశ్వక్ సేన్ కెరీర్లో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ ఫిలింగా ‘హిట్’ ని చెప్పచ్చు. వరల్డ్ వైడ్ 5 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్స్ తెచ్చిపిట్టే ఈ సినిమా మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో 1.27 కోట్ల షేర్ సాధించింది.
‘హిట్’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 66.5 లక్షలు
సీడెడ్ – 10.3 లక్షలు
గుంటూరు – 16 లక్షలు
ఉత్తరాంధ్ర – 12 లక్షలు
తూర్పు గోదావరి – 5 లక్షలు
పశ్చిమ గోదావరి – 6 లక్షలు
కృష్ణా – 8 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
‘హిట్’ ఫస్ట్ డే మొత్తం షేర్ – 1.27 కోట్లు