టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “లైలా” కి రాజకీయ రంగు అంటుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నటుడు పృథ్వి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడమే ఇందుకు కారణం. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే విశ్వక్ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈ సినిమాపై నెగెటివిటీ తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఇప్పటికీ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పినప్పటికీ ఇలాంటి పోస్టులు చేయడం తగదని “ఎక్స్”లో ట్వీట్ చేశారు.
” సినిమాలకు సంబంధించి ప్రతి పోస్టర్ నా సినిమాలకు సంబంధించిందే. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న పోస్టర్ నెల క్రితమే రిలీజ్ అయింది. మరో పోస్టర్ కూడా పాతదే. ఇలా పోస్టర్ రిలీజ్ చేసే ముందు ప్రతిసారి రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉన్న సోను మోడల్ ఈనెల 14న మీ ముందుకు వస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలం వాడటం వల్ల వచ్చేదేమీ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన దానికి ఇప్పటికే క్షమాపణ చెప్పాను. ప్రతీసారి తగ్గను. అతిగా ఆలోచించడం మానేసి ప్రేమను పంచండి. మళ్లీ చెప్తున్నా.. నన్ను, నా సినిమాలను రాజకీయాల్లోకి లాగకండి” అని విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టారు.